ప్రమాణస్వీకారం చేపట్టిన దగ్గర నుంచి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. రేషన్ లబ్ధిదారులను ఉద్దేశిస్తూ.. 'మీరు ఎక్కువ మంది పిల్లల్ని కని ఉంటే ఇంకా ఎక్కువ రేషన్ వచ్చేది కదా' అని వ్యాఖ్యానించారు. నైనిటాల్‌లోని రామ్‌నగర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"గతేడాది లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరికీ 5 కేజీల చొప్పన రేషన్ పంపిణీ చేశాం. పది మంది పిల్లలు ఉన్న వారికి 50 కేజీలు, 20 మంది ఉన్న వారికి క్వింటాల్ రేషన్ వచ్చింది. అందులో వారు కొంత అమ్ముకొని లబ్ధిపొందారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారికి మాత్రం 10 కేజీలే వచ్చింది. మీకు కూడా 20 మంది పిల్లలు ఉండి ఉంటే లబ్ధిపొందేవారు. ఎందుకు కనలేదు? అంత మంచి నాణ్యత గల బియ్యాన్ని నేను ఎప్పుడూ తినలేదు.'