అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ అమరీందర్ రాజీనామా (Amarinder Singh resigns) చేసిన 24 గంటల్లోపే కొత్త సీఎం పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. సునీల్ జాఖడ్, సుఖ్‌జీందర్‌సింగ్ రంధ్వా, రాజేందర్ కౌర్ భట్టల్ వంటి సీనియర్ నేతలను కాదని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరణ్‌జీత్‌కు (Charanjit Singh Channi) కాంగ్రెస్ పట్టం కట్టింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని (charanjit singh channi cast) పంజాబ్‌కు తొలిసారి సీఎంగా చేసింది. మెజార్టీ స్థాయిలో ఉన్న ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సిద్ధూతో (Navjot Singh Sidhu) కలుపుకొని పోయే నాయకుడైతేనే వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేరుస్తారన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.
పంజాబ్‌లో ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాట్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే సీఎం అవుతూ వస్తున్నారు. దాదాపు 20 శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. రాష్ట్రంలో 32 శాతానికి (Punjab SC population) పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా ప్రాధాన్యం అంతంత మాత్రమే. ఆ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ సీఎం పదవిని అలంకరించలేదు. ఇప్పటికే ఆ వర్గం ఓటర్లలో ఒకింత అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఎస్సీ ఓటర్లను ఆకర్షించేందుకు బీఎస్పీతో అకాలీదళ్ జట్టు కట్టింది. రైతుల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఎస్సీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భాజపా సైతం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సవాల్ విసరాలన్నా ఇదే మంచి నిర్ణయమని భావించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన చరణ్‌జీత్ సింగ్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది.
సీన్ రిపీట్ కాకుండా..