కొవిషీల్డ్ టీకా కాలపరిమితిని 6 నెలల నుంచి 9 నెలలకు పెంచాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన అభ్యర్థనను ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది. సరైన సమాచారాన్ని అందించనందుకే డబ్ల్యూహెచ్ఓ తిరస్కరించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కొవిషీల్డ్ కాలపరిమితి పెంపునకు డబ్ల్యూహెచ్ఓ 'నో' - WHO rejects SII's proposal
కొవిషీల్డ్ కాలపరిమితిని 6 నెలల నుంచి 9 నెలలకు పెంచాలనే సీరం ఇన్స్టిట్యూట్ అభ్యర్థనను డబ్ల్యూహెచ్ఓ తిరస్కరించింది. టీకా కాలపరిమితి విషయంపై సమావేశమవాలని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాని కోరినట్లు సమాచారం.
టీకా కాలపరిమితిపై సమావేశం కావాలని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాని డబ్ల్యూహెచ్ఓ కోరినట్లు తెలుస్తోంది. కొవిషీల్డ్ కాలపరిమితిని భారత్ 6 నెలల నుంచి 9 నెలలకు పెంచిన నేపథ్యంలో ఈ సమావేశమవ్వాలని కోరటం గమనార్హం. టీకాను విడుదల చేసే ముందు కనీస డోసు పరిమితి 2.5x100000000 ఉండేలా చూడాలని సీరం ఇన్స్టిట్యూట్ని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల కోరింది. కాలపరిమితి అయిపోయేవరకు ఈ డోసు స్థాయి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి:'5 లక్షల కరోనా టీకాలు వృథా చేసిన మహారాష్ట్ర'
TAGGED:
WHO rejects SII's proposal