తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలు వైట్​ సాక్స్​ నల్లగా మార్చేస్తున్నారా? - ఈ చిట్కాలతో కొత్త వాటిలా! - Tips to clean white socks

White Socks Cleaning Tips: మీ పిల్లలు వైట్​ సాక్స్​ నల్లగా మార్చేస్తున్నారా..? శుభ్రం చేయలేక చేతులు నొప్పి పెడుతున్నాయా? ఇకపై నో టెన్షన్! ఈ టిప్స్​తో కొత్తవాటిలా ​మెరుపు తీసుకురండి..

White Socks Cleaning Tips
White Socks Cleaning Tips

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 3:51 PM IST

White Socks Cleaning Tips: స్కూలు వెళ్లే చిన్నపిల్లల నుంచి ఆఫీసులకు వెళ్లే పెద్దల వరకూ.. ప్రతి ఒక్కరూ వైట్​ సాక్స్​లను ధరిస్తారు. అయితే.. చూడ్డానికి అవి ఎంత అందంగా ఉంటాయో.. పలు రకాల కారణాలతో అంత నల్లగా మారిపోతాయి. వాడిన మొదటి సారి నుంచే నల్లగా కావడం మొదలవుతాయి. కొద్ది రోజుల్లోనే నల్లగా మారిపోతాయి. ఎన్ని సార్లు శుభ్రం చేసినా.. మరకలు పోకపోవడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. దీంతో.. వీటిని శుభ్రం చేసే ఓపిక లేక చాలా మంది కొత్తవి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేదు. కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే నల్లగా మారిన వైట్​ సాక్స్​లను మెరిపించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ క్లీనర్​తో - మీ బాత్ రూమ్​ తళతళా మెరిసిపోద్ది!

బేకింగ్​ పౌడర్​:

  • వంటల్లో ఉపయోగించే బేకింగ్​ సోడాతో సాక్సులను మెరిపించవచ్చు.
  • తెల్లటి సాక్స్‌లను శుభ్రం చేయడానికి.. 1 జగ్గు నీటిలో 2 టీస్పూన్‌ల బేకింగ్ సోడా, కొద్దిగా డిటర్జెంట్​ పౌడర్​ కలపాలి.
  • ఇప్పుడు ఈ నీటిలో సాక్స్‌లను 2 గంటలు నానబెట్టండి.
  • తర్వాత సాక్స్‌లను తీసి చేతులతో రుద్దాలి. ఇలా చేస్తే సాక్స్‌లు పూర్తిగా శుభ్రమవుతాయి.

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

నిమ్మకాయ: నిమ్మకాయను ఉపయోగించి కూడా సాక్స్‌లను శుభ్రం చేయవచ్చు. ఇందులో బ్లీచింగ్​ లక్షణాలు ఉంటాయి. సాక్సులను శుభ్రం చేయడానికి..

  • ఓ గిన్నెలో 3 గ్లాసుల వేడి నీటిలో అర కప్పు నిమ్మరసం, 7చుక్కల డిష్ సోప్ కలపాలి.
  • ఇప్పుడు ఈ నీటిలో సాక్స్ వేసి 20 నిమిషాలు నానబెట్టాలి.
  • తరువాత డిటర్జెంట్‌తో శుభ్రం చేసి.. నీటితో పూర్తిగా కడగాలి.

ఈ క్లీనింగ్ టిప్స్ పాటించారంటే - మీ వాష్ బేసిన్ తళతళా మెరిసిపోతుంది!

వెనిగర్​:

  • వెనిగర్ సహాయంతో కూడా తెల్లటి సాక్స్‌లను శుభ్రం చేయవచ్చు.
  • దీని కోసం ఓ గిన్నెలో 2 కప్పుల మరిగించిన నీటిని తీసుకుని, అందులో 1 కప్పు వైట్ వెనిగర్ వేయాలి.
  • ఇప్పుడు అందులో సాక్స్‌ను నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి.
  • ఉదయం వాటిని మంచి నీటితో శుభ్రం చేయండి.

గ్యాస్ స్టౌ నుంచి మంట సరిగా రావట్లేదా? - ఇలా ఈజీగా సెట్ చేయండి!

బ్లీచింగ్​ పౌడర్​: సాక్స్‌ల జిడ్డును తొలగించడానికి బ్లీచింగ్​ పౌడర్​ ఉపయోగపడుతుంది.

  • ఓ కప్పు గోరువెచ్చని నీటిలో 4 టీస్పూన్‌ల బ్లీచింగ్‌ పౌడర్, 1 టీస్పూన్ డిష్ సోప్‌ను కలపండి.
  • ఈ మిశ్రమంలో సాక్స్‌లను 20 నిమిషాలు నానబెట్టండి.
  • ఇప్పుడు సాక్స్‌లను మామూలుగా కడగాలి.

డిష్​ సోప్​: డిష్ డిటర్జెంట్ సహాయంతో సాక్స్‌లను శుభ్రం చేసుకోవచ్చు.

  • 1 మగ్గు నీటిలో డిష్ డిటర్జెంట్ కలపి.. అందులో సాక్స్​లను రాత్రంతా నానబెట్టాలి.
  • తర్వాత, ఉదయాన్నే సాక్స్‌లను స్క్రబ్బింగ్ చేసి.. నీటితో కడగండి.

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

టీవీ స్క్రీన్​ క్లీన్​ చేస్తున్నారా? అయితే ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!

ABOUT THE AUTHOR

...view details