వల్లభ్‌బాయ్ పటేల్ చిత్రపటంపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు చెందిన వీడియో వైరల్ అయింది. ఇందిరా గాంధీ ఫొటోతో పాటు పటేల్ చిత్రపటాన్ని పెట్టించడానికి డీకే శివకుమార్, సిద్ధ రామయ్యకు మధ్య జరిగిన సంభాషణ రాజకీయ దుమారం రేపింది.
పటేల్ చిత్రపటంపై డీకే శివకుమార్, సిద్దారామయ్య వైరల్ వీడియో ఇందిరాగాంధీ వర్దంతి (అక్టోబర్ 31) నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో కర్ణాటక కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభలో ఇందిరాగాంధీ ఫొటోను పెట్టి పూలమాలలు వేశారు. ఇదే రోజున పటేల్ జయంతి కూడా ఉన్న సందర్భంగా ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టాలని డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య సభలోనే చెప్పారు. 'ఈ రోజున మనం పటేల్ చిత్రపటం ఎప్పుడూ పెట్టలేదు కదా!' అని బదులిచ్చారు శివకుమార్. ఇందుకు స్పందిస్తూ భాజపా విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఉంటుందని సిద్ధ రామయ్య అన్నారు. అనంతరం.. ఉద్యోగులకు చెప్పి పటేల్ ఫొటోను కూడా తెచ్చి ఇందిరాగాంధీ చిత్రపటం పక్కన పెట్టారు. సభలో మైక్ ఆఫ్ చేయకపోవడం వల్ల వీరి సంభాషణ అందరికీ వినిపించింది.
ఈ వీడియోను భాజపా ఎమ్మెల్యే రేణుకాచార్య అక్టోబర్ 31న విడుదల చేశారు.
అవమానకరం..
ఈ వీడియో రాజకీయంగా విమర్శలకు దారితీసింది. స్వాతంత్య్రయోధులకు గౌరవం ఇవ్వడం కంటే తమ కుటుంబాన్ని ఆరాధించడం చాలా ముఖ్యమనే కాంగ్రెస్ కపటత్వాన్ని ఈ వీడియో బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పటేల్ పట్ల కాంగ్రెస్‌కు ఎంత గౌరవం ఉందో అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. ఐక్యతా విగ్రహం స్థాపించేప్పుడు పటేల్‌ను కాంగ్రెస్ విమర్శించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ తమ కుటుంబంలో అందరికీ భారత రత్న ఇచ్చుకుంది.. కానీ పటేల్ సేవలకు గుర్తింపును ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏ భావాజాలాన్ని కలిగి ఉందో, వారి నాయకులు ఏంటో ఈ వీడియో తెలుపుతోందని చెప్పారు.
భాజపాకు బయపడి పటేల్ ఫొటోను ఇందిరాగాంధీ చిత్రపటం పక్కన పెట్టడం అవమానకరం అని భాజపా జాతీయ కార్యదర్శి సీటీ రవి అన్నారు.
డీకే శివకుమార్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల సంచలనం సృష్టిస్తున్నాయి. శివకుమార్ లంచం తీసుకున్నాడని, మద్యం తాగి మాట్లాడుతున్నాడని ఆ పార్టీ నేతలే మాట్లాడుకున్న ఓ వీడియో ఇటీవల వైరల్ అయింది.
ఇదీ చదవండి:గంభీర్‌కు బెదిరింపులు- చంపేస్తామంటూ 'ఐఎస్‌ఐఎస్ కశ్మీర్' లేఖ
Cabinet meeting: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం