తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓవైపు 75ఏళ్ల వేడుకలు.. మరోవైపు అడ్డగింతలా?'

లఖింపుర్​లో పర్యటించేందుకు రాజకీయ నాయకులను అనుమతించకపోవడానికి కారణమేంటని కేంద్రాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​(Arvind Kejriwal News) ప్రశ్నించారు. లఖింపుర్ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని దేశం కోరుకుంటోందని చెప్పారు.

Arvind Kejriwal News
అరవింద్ కేజ్రీవాల్​

By

Published : Oct 6, 2021, 12:44 PM IST

లఖింపుర్​ పర్యటనకు రాజకీయ నాయకులను అనుమతించకపోవడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal News) మండిపడ్డారు. లఖింపుర్ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని(Arvind Kejriwal News) చెప్పారు.

"ఓవైపు 75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ప్రభుత్వం జరుపుతోంది. మరోవైపు.. లఖింపుర్ ఖేరిలో పర్యటించడానికి రాజకీయ నాయకులను అనుమతించటం లేదు. దీని వెనుక కారణం ఏంటి? పీఎంజీ.. నిందితులు అరెస్టు కావాలని, కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు."

-అరవింద్ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

అంతకుముందు.. ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​లో కాంగ్రెస్​ అగ్ర​నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi News) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం పర్యటించేందుకు ఆ రాష్ట్ర​ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. లఖ్​నవూలో 144వ సెక్షన్​ అమలవుతున్నందున ఈ పర్యటనకు అనుమతినివ్వట్లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'రైతులపై వరుస దాడులు.. నియంత పాలనలో దేశం'

ABOUT THE AUTHOR

...view details