తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోతికి చిప్స్ ఇస్తూ 100అడుగుల లోయలో పడిపోయిన టూరిస్ట్

సరదాగా కోతికి చిప్స్ ఇద్దామని అనుకున్న ఓ వ్యక్తి.. తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా కాలు జారి వంద అడుగుల లోయలో పడిపోయాడు. స్థానిక ట్రెక్కర్లు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి అతడిని కాపాడారు.

monkey chips tourist fell into a hundred feet deep valley
.

By

Published : Jun 28, 2022, 3:46 PM IST

కోతికి చిప్స్ ఇస్తూ 100అడుగుల లోయలో పడిపోయిన టూరిస్ట్

Mahabaleshwar tourist fell into valley: కోతికి చిప్స్ ఇస్తూ ఓ టూరిస్ట్ లోయలో పడిపోయాడు. మహారాష్ట్ర మహాబలేశ్వర్- ప్రతాప్​గఢ్ ఘాట్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్​కు చెందిన సందీప్ ఓంకార్ నేహ్తే(33).. ప్రస్తుతం పుణెలోని బావ్దాన్​లో ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి హరిహరేశ్వర్ నుంచి మహాబలేశ్వర్​కు వెళ్తున్నాడు. అంబెన్లీ ఘాట్​ రోడ్డుపై ప్రయాణిస్తున్న వీరు.. జనని మాత మందిరం సమీపంలోని ఓ లోయ వద్ద కోతులను చూశారు. వాటికి ఆహారం పెట్టేందుకు ఆగారు. ఈ క్రమంలోనే సందీప్.. కోతులకు చిప్స్ అందించేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కాలుజారి వంద అడుగుల లోయలోకి పడిపోయాడు.

అయితే, వెంటనే స్థానిక ట్రెక్కర్లు, మహాబలేశ్వర్ పోలీసులకు సమాచారం అందింది. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు ప్రారంభించి.. బాధితుడి జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వర్షంతో పాటు దట్టంగా పొగమంచు అలుముకున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించారు. మూడు గంటల పాటు శ్రమించి.. సందీప్​ను బయటకు తీశారు. వెంటనే మహాబలేశ్వర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సతారా జిల్లా ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details