తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Goa assembly Polls: గోవాలో మళ్లీ సంకీర్ణమేనా? కింగ్​మేకర్​ ఎవరు? - goa assembly in TMC

Goa assembly Polls: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోవాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడ బహుముఖ పోటీ నెలకొనగా.. విజయంపై అన్ని పార్టీలు ధీమాగానే ఉన్నాయి. పశ్చిమతీర ప్రాంతమైన గోవాలో భాజపా మూడోసారి అధికారంలోకి వస్తుందా? గత ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా.. అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్​.. ఈ సారి ఎలా ముందుకెళ్తోంది? ఆప్​ దూకుడు గోవాలో ఎలా ఉండబోతుంది? గత ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? గోవాలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందా?

Which party will win in Goa?
గోవాలో మళ్లీ సంకీర్ణమేనా?

By

Published : Jan 23, 2022, 5:37 PM IST

Goa assembly Polls: వైశాల్యపరంగా రెండో అతిచిన్న రాష్ట్రం, కొంకణ తీరంగా చెప్పుకునే 'గోవా'.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరోసారి గెలిచి పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం 'ఎవరికి వారే యమునా తీరే' అన్న చందంగా బరిలోకి దిగుతుండటం వల్ల ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది.

దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోయి.. తమకు లాభిస్తోందని భాజపా ఆశలు పెట్టుంది. అయితే ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న కాంగ్రెస్​.. కాషాయ దళానికి గట్టి పోటీ ఇచ్చేది తామేనని ​అంటోంది. తృణమూల్ కాంగ్రెస్​, ఎన్సీపీ, శివసేన, ఆప్ కంటే.. భాజపాకు గోవాలో తామే ప్రత్యామ్నాయం అని నొక్కిచెబుతోంది. గత ఎన్నికల్లో 17 సీట్ల గెలుచుకొని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. భాజపా 13 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో హంగ్​ ఏర్పడింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.​

మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో ప్రధాన పార్టీల బలాబలాలు.. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లు.. గెలుచుకున్న సీట్లు.. తదితర అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు
గోవా అసెంబ్లీ ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details