రాష్ట్రాన్ని అట్టుడికిస్తున్న రాసలీలల సీడీ విడుదల చేసిన నిందితుల కోసం దర్యాప్తు దళం అధికారులు గాలింపు తీవ్రం చేశారు. నిందితులు ప్రయాణ సమయంలో తమ చరవాణి నుంచి సిమ్ తొలగించడం, కొత్త సిమ్ కార్డులను వినియోగించడంతో వారి జాడను గుర్తించలేక పోతున్నారు. వీడియోను అంతర్జాలంలోకి అప్‌లోడ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు బస్సుల్లోనే సంచరిస్తున్నారని, ఆయా బస్టాండ్లకు సమీపంలోని హోటళ్లలో బస చేస్తున్నారని గుర్తించారు.
జార్ఖిహోళి మంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం ఇస్తానంటూ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన యువతి, రహస్య కార్యాచరణకు కెమెరా, ఇతర ఉపకరణాలను ఎక్కడ కొన్నారో తెలుసుకునే ప్రయత్నాలను ప్రత్యేక దర్యాప్తు దళం- సిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు నివేదికను ఏప్రిల్ 17 కన్నా ముందుగానే న్యాయస్థానం ముందు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియరు ఐపీఎస్ అధికారి సౌమేంద్రు ముఖర్జీ తెలిపారు.