తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాష్ట్రపతిగా నరేంద్ర మోదీ... ప్రధాని సమాధానం ఇదే!

సభలో ప్రతిపక్షాలు చుట్టుముట్టినా.. ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే ప్రధాని నరేంద్రమోదీ.. ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యారు. సమాధానం ఏం చెప్పాలో తెలియక గట్టిగా నవ్వారు. చిన్నారి మాత్రం.. మోదీ ఎందుకు నవ్వుతున్నారో తెలియక అలానే చూస్తూ.. ఉండిపోయింది. ఇంతకీ ఆ బాలిక అడిగిన ప్రశ్న ఏంటి? అసలేం జరిగింది.

pm modi as president of india
రాష్ట్రపతిగా నరేంద్ర మోదీ

By

Published : Aug 13, 2021, 2:00 PM IST

మహారాష్ట్రకు చెందిన ఓ చిన్నారి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అడిగిన ప్రశ్న ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. భారత ప్రధానమంత్రి మోదీని.. 'మీరు ఎప్పుడు దేశానికి రాష్ట్రపతి అవుతారు' అని తన తేనెలొలికే మాటలతో అడిగింది. అది విన్న ప్రధాని, పక్కన ఉన్నవారు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. ఇలా ఒక్క ప్రశ్నతో ప్రధాని నోట నవ్వులు పూయించిన చిన్నారి ఎవరో కాదు. అహ్మద్​నగర్​ భాజపా ఎంపీ సుజయ్​ విఖే పాటిల్​ కుమార్తె.. అనీషా. మోదీతో కలిసి అనీషా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చిన్నారి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.

చిన్నారి అనిషాతో ప్రధాని మోదీ

చిన్ననాటి నుంచే అభిమానం..

పదేళ్లు వయసు ఉన్న అనీషా పాటిల్​కు చిన్ననాటి నుంచే ప్రధాని మోదీ అంటే చాలా అభిమానం. దీంతో ఆయనను చూడాలని కోరికను పెంచుకుంది. తండ్రి సుజయ్​ దగ్గర పలు మార్లు తన అభిష్టాన్ని తెలుపగా అందుకు తండ్రి.. ప్రధానికి ఉన్న బిజీ షెడ్యూల్స్​తో అపాయింట్​మెంట్​ దొరుకుతుందో.. లేదో అని చెప్పారు. దీంతో అనీషానే స్వయంగా ప్రధాని అపాయింట్​మెంట్​ కోరుతూ.. ఆయన కార్యాలయానికి ఈ మెయిల్​ పెట్టింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మోదీ.. అనీషాను తన ఛాంబర్​కు ఆహ్వానించారు. కొంత సమయం పాటు తనతో ముచ్చటించారు. మోదీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. చివరగా అనీషా ఓ ప్రశ్న వేసింది. 'మీరు గుజరాత్​ నుంచి వచ్చారు కదా.. మరి మీరు ఎప్పుడు రాష్ట్రపతి అవుతారు' అని అడిగింది. ఈ ప్రశ్నకు అవాక్కయిన మోదీ పకపక నవ్వారు.

మోదీతో పాటిల్​ కుటుంబం

మోదీతో సమావేశమైన తర్వాత అనీషాతో ఆమె కుటుంబ సభ్యులు ప్రధానిని సన్మానించారు. ఈ క్రమంలో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఇదీ చూడండి:'15కోట్ల మంది బాలలు, యువత చదువుకు దూరం'

ABOUT THE AUTHOR

...view details