Ramesh kumar comments on rape: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
అసెంబ్లీ సమావేశంలో చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించింది. 'నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ అస్వాదిస్తూ 'అవును', 'అవును' అంటూ ఉండాలి. అంతే' అని స్పీకర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
దీంతో రమేశ్ కుమార్ స్పందిస్తూ.. 'అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు' అని అన్నారు.