తెలంగాణ

telangana

ETV Bharat / bharat

whatsapp: వినియోగదారులకు కేంద్ర మంత్రి భరోసా - వాట్సప్​ ప్రైవసీపై కేంద్రం

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల వల్ల వాట్సప్​ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని కేంద్ర మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు. దుష్ప్రచారం, అసభ్య భావజాలానికి బాధితులైన వారికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

govt on whatsapp privacy, వాట్సప్​ ప్రైవసీపై కేంద్రం
వాట్సప్​ వర్సెస్​ కేంద్రం

By

Published : May 27, 2021, 12:56 PM IST

Updated : May 27, 2021, 1:11 PM IST

సామాజిక మాధ్యమాలపై(social media) కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలకు వాట్సప్​(whatsapp) వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ స్పష్టం చేశారు. అసభ్య భావాజాలం, దుష్ప్రచారాలను కట్టడి చేసేందుకే ఈ కొత్త నిబంధలను తెచ్చినట్లు వెల్లడించారు.

వినియోగదారులకు ప్రశ్నించే హక్కు సహా వారు విమర్శలు వ్యక్తం చేయడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. కొత్త రూల్స్​ సామాజిక మాధ్యమ వినియోగదారులకు(social media) మరింత బలం చేకూరుస్తాయని పేర్కొన్నారు. దుష్ప్రచారం, అసభ్య భావజాలానికి బాధితులైన వారికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం సోషల్​ మీడియా(social media) సంస్థలు భారత్​కు చెందిన గ్రీవియన్స్​ రిడ్రెసల్​ ఆఫీసర్​, నోడల్​ ఆఫీసర్, కంపైలన్స్​ ఆఫీసర్​ను నియమించాలని కేంద్రం ఆదేశించింది.

ఇదీ చదవండి :whatsapp: కేంద్రం X వాట్సప్‌.. ముదురుతున్న వివాదం

Last Updated : May 27, 2021, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details