కొత్త ప్రైవసీ పాలసీని ఖాతాదారులు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి చేస్తోందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణ బిల్లు అమలు కాకముందే తమ యూజర్లు ప్రైవసీ పాలసీని అంగీకరించేలా నిరంతరం నోటిఫికేషన్లు పంపిస్తోందని పేర్కొంది. అలా చేయకుండా నిలువరించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరింది కేంద్రం.
వాట్సాప్ ప్రైవసీ పాలసీని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ప్రైవసీ పాలసీ.. గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉందన్నది పిటిషనర్ల వాదన.