తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాట్సాప్ స్టేటస్​కు నిండు ప్రాణం బలి- కుమార్తె పనికి తల్లి మృతి

Whatsapp Status Controversy: వాట్సాప్‌ స్టేటస్‌ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కుమార్తె పెట్టిన ఓ స్టేటస్‌ తల్లి మరణానికి కారణమైంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో జరిగింది.

Woman lost her life over whatsapp status in Mumbai
వాట్సాప్ స్టేటస్ వివాదం.. మహిళ మృతి ​

By

Published : Feb 14, 2022, 6:53 PM IST

Whatsapp Status Controversy: మహారాష్ట్రలోని బోయిసర్ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. వాట్సాప్ స్టేటస్ విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. శివాజీనగర్‌లో నివసించే లీలావతి దేవి కుమార్తె ప్రీతి ఓ కళాశాలలో చదువుతోంది. ఈమె కొన్ని రోజుల క్రితం వాట్సాప్‌లో స్టేటస్ పోస్ట్ చేసింది.

దీంతో కాలేజీలో పెద్ద గొడవ జరిగింది. కొంతమంది లీలావతిదేవి ఇంటికి వచ్చి తల్లీకుమార్తెలపై దాడి చేశారు. ఈ దాడిలో లీలావతి దేవికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు లీలావతి దేవిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితులపై కేసు నమోదు చేసే వరకు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లేది లేదని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో కుటుంబీకులు ఆందోళన విరమించారు. దాడి చేసిన వారిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.

వాట్సాప్‌ స్టేటస్‌ వివరాలు వెల్లడించలేమని, కానీ అది అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details