తెలంగాణ

telangana

By

Published : May 17, 2021, 2:18 PM IST

Updated : May 17, 2021, 2:46 PM IST

ETV Bharat / bharat

'ప్రైవసీ పాలసీతో ఐటీ చట్టం ఉల్లంఘన'

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్​ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ.. భారత ఐటీ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది.

WhatsApp privacy
వాట్సాప్ ప్రైవసీ పాలసీ

వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ.. దేశంలోని ఐటీ చట్టం నియమ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్​ కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్​ డీఎన్​ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కేంద్రం, ఫేస్​బుక్​, వాట్సాప్​కు నోటీసులు జారీ చేసింది.

తమ ప్రైవసీ పాలసీ మే15 నుంచి అమల్లోకి వచ్చిందని వాట్సాప్.. హైకోర్టు ధర్మాసనానికి వివరించింది. ఈ నూతన పాలసీని అంగీకరించని వారి ఖాతాలను తొలగించమని, మునుపటి లాగే వాట్సాప్ సేవలు కొనసాగుతాయని కోర్టుకు తెలిపింది.

ఒకేలా చూడట్లేదు..

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. భారత ఐటీ చట్టానికి పూర్తిగా విరుద్ధమని, ఇదే విషయంపై ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జూకర్​బర్గ్​కు లేఖ రాశామని.. కానీ ఇంకా వారి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు వివరించింది.

యూరోపియన్లను చూసిన విధంగా.. భారత వినియోగదారులను వాట్సాప్ సంస్థ చూడట్లేదని కేంద్రం ధర్మాసనానికి వివరించింది. ఇప్పటికే భారత్​లో వాట్సాప్ ప్రైవసీ పాలసీని ఏకస్వరంతో వ్యతిరేకించారని.. వారి ఉద్దేశం మేరకే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

చట్టానికి లోబడే..

తన వివరణలు ధర్మాసనం ముందు వినిపించిన వాట్సాప్ సంస్థ.. భారత ఐటీ చట్టానికి అనుగుణంగానే కొత్త ప్రైవసీ పాలసీ ఉందని తెలిపింది. తమ ప్రైవసీ పాలసీ మే 15 నుంచి వచ్చినట్లు వివరించింది.

ఇరువురి వాదనలు విన్న దిల్లీ హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను జూన్​ 3కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి :'ఆపద వేళ.. ఆశాకిరణంలా 2-డీజీ డ్రగ్'​

Last Updated : May 17, 2021, 2:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details