బంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మమత మరోసారి అధికారంలోకి వస్తే బంగాల్.. కశ్మీర్‌లా తయారవుతుందని భాజపా నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు అవివేకమైనవిగా అభివర్ణించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. బంగాల్.. కశ్మీర్‌లా మారితే తప్పేంటని భాజపాను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
" 2019 ఆగస్టులో కశ్మీర్లో అధికరణ 370 రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్ స్వర్గంలా మారిందని భాజపా తెలిపింది. మరి ఇప్పుడు బంగాల్.. కశ్మీర్‌లా మారితే తప్పేంటి? ఏదేమైనా.. బంగాల్ ప్రజలు కశ్మీర్‌ను ప్రేమిస్తారు."