మొన్న ఆల్ఫా.. నిన్న డెల్టా.. నేడు మ్యూ.. ప్రపంచాన్ని కొవిడ్ వేరియంట్లు పట్టిపీడిస్తున్నాయి. మ్యూ వ్యాప్తిపై(mu variant) పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) శాస్త్రవేత్తలు.. ఈ కొత్త రకాన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా గుర్తించారు. ఈ వేరియంట్(mu variant covid) ఎంత ప్రమాదకరం? దీనిపై టీకాలు పనిచేయవా? భారత్‌లో మ్యూ కేసులు బయటపడ్డాయా?
వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే?
సాధారణంగా వైరస్లు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంటాయి. కొన్నిట్లో మ్యుటేషన్ల కారణంగా వాటి తీవ్రత తగ్గుతుంది. మరికొన్నిట్లో మాత్రం ఉద్ధృతి మరింత తీవ్రమవుతుంది. ఈ రెండో రకంతో టీకాల సామర్థ్యం కూడా తగ్గే ప్రమాదం ఉంది. కొన్ని పరీక్షల్లో బయటపడవు కూడా. వైరస్ ఉద్ధృతి పెంచే విధంగా మార్పులు జరిగితే దానిని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా గుర్తిస్తారు. మ్యూ వేరియంట్‌కు ఈ లక్షణాలు చాలానే ఉండటం ఆందోళనకరం. ఈటా, లోటా, కప్ప, లాంబ్డా.. ఈ వైరస్ రకాలను కూడా 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా పరిగణిస్తున్నారు.
ఇదీ చూడండి:-డేంజర్ 'డెల్టా'కు చైనా చెక్.. ఎలా సాధ్యమైందంటే?
ప్రపంచంలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. మ్యూ వేరియంట్.. డెల్టాకు మించిన హాని కలిగిస్తే, అప్పుడు దానిని 'ఆందోళనకర వైరస్ వేరియంట్'(variant of concern)గా గుర్తిస్తారు. ప్రస్తుతం ఆల్ఫా, బీటా, గామా, డేల్టా ఈ జాబితాలో ఉన్నాయి.
టీకాలు పనిచేయవా?
వైరస్.. స్పైక్ ప్రోటీన్ల సాయంతో మనిషి శరీరంలోని కణాలలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వైరస్‌పై మనిషి రోగ నిరోధక శక్తి పోరాటం చేసే విధంగా వ్యాక్సిన్లను రూపొందించారు. కొత్త వేరియంట్ల వల్ల స్పైక్ ప్రోటీన్లలో మార్పులు జరిగితే టీకా సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.
ఇదీ చూడండి:-Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'కు బలి
మ్యూ వేరియంట్.. టీకాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీల నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసింది(mu variant covid vaccine). దీనిపై పూర్తిస్తాయి పరిశోధనలు చేయాల్సి ఉంది. ప్రపంచ జనాభాపై దీని ప్రభావం ఎంత ఉంటుందనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతానికైతే కొవిడ్ వేరియంట్ల కారణంగా టీకాల సామర్థ్యం తగ్గలేదు!
వైరస్‌కు.. టీకా ఒక్కటే పరిష్కారమా?