CDS Bipin Rawat Death: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ట్రై-సర్వీస్ విచారణకు ఆదేశించారు. ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ మొదలైంది.
ట్రై-సర్వీస్ విచారణ అంటే?
అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరణించిన ఘటనల్లో ఆర్మీ, నౌకాదళ, వాయుసేనకు చెందిన మూడు విభాగాలు సంయుక్త విచారణ చేపడతాయి. త్రిదళాల నుంచి ఎంపిక చేసిన సైనిక సిబ్బందితో విచారణ నిర్వహించేందుకు ఓ కమిటీని నియమిస్తారని బ్రిగేడియర్ డాక్టర్ బీ.కే. ఖన్నా తెలిపారు.
"ఈ విచారణలో బ్లాక్ బాక్స్, హెలికాప్టర్ శిథిలాలపై సమగ్ర విచారణ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో.. మానవ తప్పిదం, యాంత్రిక లోపం, వాతావరణ పరిస్థితులు, తీవ్రవాద దాడి అనే నాలుగు ముఖ్యమైన అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తాం"