What is the Significance of Rangoli:సంక్రాంతి వచ్చిదంటే.. భోగి మంటలు, డూడూ బసవన్నల సందడి, అందమైన రంగవల్లులు, పిండివంటలు, ఆకాశంలో పతంగుల రెపరెపలు ఇలా ఒక్కటేమిటి.. పండగ మూడు రోజులు సందడే సందడి ఉంటుంది. ఇక ఈ పండగ రోజుల్లో అయితే ముగ్గుల హడావుడి మామూలుగా ఉండదు. లేడీస్ తమలోని క్రియేటివిటీని బయటికి తీసి మరి అందంగా తీర్చిదిద్దుతారు. అసలు ఇలా ముగ్గులు ఎందుకు వేస్తారు..? ముగ్గులు వేయకపోతే ఏం జరుగుతుంది..? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ముగ్గులు ఎలా వేస్తారు:మట్టినేల మీద అయితే ముగ్గులు పూర్తిగా బియ్యప్పిండితోనూ, ముగ్గు పిండితోనూ వేస్తారు. ఇక పట్టణాల్లో మొత్తం ఫ్లోరింగ్ ఉంటుంది కాబట్టి.. ముగ్గుపిండితో వేసే వాళ్లు కొద్దిమంది ఉంటే.. చాక్‌పీస్‌తో వేసేవారు మరికొద్దిమంది ఉంటారు. బొటన వేలు, చూపుడు వేలు మధ్య పిండిని తీసుకుని ధారగా వదులుతూ మనకి కావాల్సిన డిజైన్‌లో ముగ్గు వేసుకోవడమే. ముగ్గులని చుక్కలు పెట్టి వేస్తారు, చుక్కలు లేకుండా అలాగే కూడా వేసేస్తారు. ఈ ముగ్గులు పూలు, ఆకులు.. ఇలా ఒక్కటేమిటి మనకు నచ్చిన డిజైన్స్‌లో వేస్తుంటారు. ఇక సంక్రాంతి, రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్‌గా ముగ్గులు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గులో భోగి కుండలు, చెరుకు గడలు, గాలిపటాలు ఉంటే, దీపావళి ముగ్గులో దీపాలు ఉంటాయి. కనుమ రోజు, రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ముగ్గు వేసిన తరువాత ముగ్గుకి నాలుగు వైపులా బోర్డర్స్ గీస్తారు. ఇవి కూడా రకరకాల డిజైన్స్‌లో ఉంటాయి.
ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది..?:మరి ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుందో పురాణాల్లో వివరించారు. ఎవరి ఇంటి ముందైతే ముగ్గు ఉండదో.. వాళ్ల ఇంట్లోకి లక్ష్మీదేవి రాదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకీ వస్తుందనీ, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా ఊడ్చి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందనీ అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతోటీ, ధనధాన్యాలతోటీ, సుఖశాంతులతోటీ నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే, తెల్లవారు జామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు. అందుకే పండగల రోజు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు. దీనికి మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే..