బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా రాంపుర్‌లో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.
బంగాల్లో బాంబు పేలుడు- భాజపా కార్యకర్తలకు గాయాలు - క్రూడ్ బాంబు
బంగాల్లో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బంగాల్లో బాంబు పేలుడు- ఆరుగురు భాజపా కార్యకర్తలకు గాయాలు
ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ నేతలే కారణమని భాజపా ఆరోపిస్తోంది. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ నేతలు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఘోర ప్రమాదం- ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు