మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ను ఓడించాలనే కృత నిశ్చయంతో బంగాల్ ప్రజలంతా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బంగాల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతారని నడ్డా జోస్యం చెప్పారు. అక్కడ భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆమె వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. మమత వేరే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయం తృణమూల్ కార్యకర్తల నుంచే తనకు తెలిసిందని అన్నారు. రెండు దశల పోలింగ్‌లో భాజపా అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.