బంగాల్ శాసనసభ మూడో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 205 మంది అభ్యర్థుల్లో 26 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) స్పష్టం చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది.
ఏడీఆర్ నివేదిక వివరాలు..
- 102(50 శాతం) మంది అభ్యర్థులు 12వ తరగతి వరకు చదువుకున్నారు.
- 53(26 శాతం) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి.
- 43(21 శాతం) మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కుంటున్నారు.
- 33 మంది అభ్యర్థులు కోటీశ్వరులుగా పేర్కొన్నారు.