తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాసన మండలి ఏర్పాటుతో దీదీ కొత్త స్కెచ్! - suvendu adhikari

శాసన మండలి ఏర్పాటు చేయాలని కోరుతూ.. తృణమూల్​ కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బంగాల్​ శాసనసభ ఆమోదించింది. 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మరో 69 మంది వ్యతిరేకించారు. భాజపా సభ్యులు ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు.

West Bengal passes Legislative Council resolution
మంత్రిమండలి ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం

By

Published : Jul 6, 2021, 6:51 PM IST

బంగాల్​లో శాసన మండలి ఏర్పాటు కోసం.. ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. అధికార పక్షం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 196 మంది అనుకూలంగా ఓటేశారు. 69 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇందులో భాజపా శాసనసభ్యులు సహా.. ఏకైక ఐఎస్​ఎఫ్​ ఎమ్మెల్యే ఉన్నారు.

తృణమూల్​ కాంగ్రెస్​ బ్యాక్​డోర్​ పాలిటిక్స్​ను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీ సభ్యులు.. చట్టసభ్యులుగా ఎన్నికయ్యేందుకే శాసన మండలిని తీసుకొస్తున్నారని విమర్శించింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

ఎమ్మెల్యేలుగా గెలవని వారు ముఖ్యమంత్రి/మంత్రి పదవి చేపడితే.. ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో.. రాష్ట్రంలో అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో.. శాసన మండలి ఏర్పాటు చేయాలని తృణమూల్​ కాంగ్రెస్​ తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈసీ ముందుకు రాకపోతే..

రాజ్యాంగం ప్రకారం నవంబరు 4లోగా ఎమ్మెల్యేగా మమత ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా మూడో ఉద్ధృతి రావచ్చనే ఆందోళన నేపథ్యంలో బంగాల్‌లో ఖాళీగా ఉన్న భవానీపుర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకు రాకపోతే ఉత్తరాఖండ్​ సీఎంగా తప్పుకున్న తీరథ్‌ మాదిరి పరిస్థితే ఆమెకు ఎదురు కావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సెప్టెంబరు 10లోపు తీరథ్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా కేసుల కారణంగా మరికొన్ని నెలలపాటు ఉప ఎన్నికలు జరిపే అవకాశం లేనందున కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు తీరథ్‌ ప్రకటించారు.

అది అనుమానమే..

కరోనా పరిస్థితుల్లోనూ ఎన్నికలను నిర్వహిస్తుండడం ఈసీ నేరపూరిత నిర్లక్ష్యమని ఇప్పటికే మద్రాస్‌ హైకోర్టు గట్టిగా తలంటింది. అందువల్ల బంగాల్‌లో సమీప భవిష్యత్తులో ఉప ఎన్నిక జరుగుతుందా అనేది అనుమానమే. గతంలో కొందరు మంత్రులు సభలో సభ్యులు కాకుండానే పదవి చేపట్టి, ఆరు నెలలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి, మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఏడాది వరకు నెట్టుకురాగలిగారు. అలాంటిది చెల్లదని సుప్రీంకోర్టు 1995లో నిషేధం విధించింది.

ఇదీ చూడండి: మమతా బెనర్జీకి పదవీ గండం తప్పదా?

అసెంబ్లీలో హైడ్రామా- గవర్నర్​ ప్రసంగానికి బ్రేక్

ABOUT THE AUTHOR

...view details