అసెంబ్లీ ఎన్నికల అనంతరం బంగాల్లో చోటు చేసుకున్న హింసపై(West Bengal Violence) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణను వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తోందని, నిష్పాక్షిక దర్యాప్తు జరగడం లేదని బంగాల్ ప్రభుత్వం ఆరోపించింది.
Bengal Violence: బంగాల్ హింసపై సుప్రీంకు మమత సర్కార్ - బంగాల్లో ఎన్నికల అనంతరం హింసపై సీబీఐ
బంగాల్లో చోటు చేసుకున్న హింసపై(West Bengal Violence) కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను వ్యతిరేకిస్తూ.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది.
మమతా బెనర్జీ
జాతీయ మానవ హక్కుల కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసపై విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. హింసకు సంబంధించిన ఇతర కేసులపై విచారణ చేపట్టాలని సిట్‌ను ఆదేశించింది. ఆరు వారాల్లో ఈ రెండు సంస్థలు తమ నివేదికల్ని సమర్పించాల్సి ఉంది.
ఇదీ చూడండి:Harish rawat news: 'క్షమించండి.. అలా మాట్లాడి ఉండకూడదు'