తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కస్టడీలో యువకుడు మృతి- పోలీస్ వాహనాలకు నిప్పు - బంగాల్ కస్టడీ మరణం

పోలీసు కస్టడీలో 21ఏళ్ల యువకుడు మరణించాడన్న ఆరోపణలతో బంగాల్​లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

west bengal custodial death
పోలీస్ కస్టడీలో యువకుని మృతి.. పోలీసుల సస్పెండ్

By

Published : Jul 6, 2021, 6:15 PM IST

Updated : Jul 6, 2021, 8:26 PM IST

కస్టడీలో యువకుడు మృతి- పోలీస్ వాహనాలకు నిప్పు

బంగాల్​ పశ్చిమ్ బర్ధమాన్ జిల్లా కుల్తీ పోలీసు స్టేషన్​లో 21 ఏళ్ల యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించడం దుమారం రేపింది. పోలీసులు కొట్టడం వల్లే అతడి చనిపోయాడని ఆరోపిస్తూ యువకుడి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బరాకర్ ఆరాటో పోలీసు ఔట్​పోస్ట్​పై దాడి చేసి.. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

దొంగతనం కేసులో సోమవారం రాత్రి యువకుణ్ని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు జైలులో చిత్రహింసలు పెట్టారని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు సదరు పోలీసులను సస్పెండ్ చేశారు.

"జైలులో ఉన్న నిందితుడి ఆరోగ్యం మంగళవారం ఉదయం క్షీణించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నిరసనల్లో ఎవరూ గాయపడలేదు. ఘటనకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశాం. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులో ఉన్నాయి."

-సీనియర్ పోలీసు అధికారి

ఇవీ చదవండి:

Last Updated : Jul 6, 2021, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details