Bengal liquor deaths: బంగాల్లో కల్తీ సారా తొమ్మిది మంది ప్రాణాలు తీసింది. హావ్‌డా, ఘుసురీ ప్రాంతంలోని గజానంద్ బస్తీలో ఈ ఘటన జరిగింది. బస్తీలో విక్రయించిన సారా తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. కాగా, కొన్ని మృతదేహాలకు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పలువురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపాయి.
కల్తీ సారా తాగి 9 మంది మృతి.. మరికొందరికి అస్వస్థత - పశ్చిమ బంగాల్ కల్తీ సారా న్యూస్
కల్తీ సారా తొమ్మిది మందిని కబళించింది. అక్రమంగా నిర్వహిస్తున్న లిక్కర్ షాపులో మద్యం సేవించి వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. మలిపంచఘోర ప్రాంతంలో ప్రతాప్ కర్మాకర్ అనే వ్యక్తి అక్రమంగా లిక్కర్ షాపు నడుపుతున్నాడు. స్థానిక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు రోజూ ఈ లిక్కర్ షాప్‌కు వెళ్లి తాగేవారు. బస్తీవాసులు అస్వస్థతకు గురైన రోజు కూడా ఇక్కడే మద్యం సేవించారు. ఈ క్రమంలోనే కొందరు మరణించారు. దీంతో ఆల్కహాల్ షాపు యజమానిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల మృతికి అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుల శవపరీక్షల నివేదికలు అందిన తర్వాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: