తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2021, 7:08 PM IST

ETV Bharat / bharat

​​​​​పెట్రోల్​, డీజిల్​పై రూ.1 తగ్గించిన బంగాల్​ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు కొండెక్కుతున్న వేళ.. పెట్రోలు, డీజిల్​పై రూ.1 చొప్పున తగ్గించింది బంగాల్​ సర్కారు. ఈ సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.

West Bengal Govt reduces tax by Rs.1 per liter on petrol and diesel
​​​​​​పెట్రోలుపై రూ.1 తగ్గించిన రాష్ట్ర సర్కారు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్న నేపథ్యంలో ప్రజలపై కాస్త కనికరం చూపింది బంగాల్​ ప్రభుత్వం. లీటర్‌ డీజిల్‌, పెట్రోల్‌పై రూపాయి చొప్పున తగ్గించింది. సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొంతమేర ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు.

పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 పన్ను విధిస్తుంటే రాష్ట్రం రూ.18.46 మాత్రమే వసూలు చేస్తోందని అమిత్‌ మిత్రా పేర్కొన్నారు. అలాగే డీజిల్‌పై కేంద్రం రూ.31.80 సంపాదిస్తుంటే రాష్ట్రం రూ.12.77 మాత్రమే పన్ను వేస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం రాకుండా కేంద్రం సెస్సులు వసూలు చేస్తోందని.. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:'కేరళ ఎన్నికల్లో మెట్రోమ్యాన్ ప్రభావం తక్కువే'

ABOUT THE AUTHOR

...view details