బంగాల్ ముఖ్య కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ డిప్యుటేషన్‌పై ప్రధాని మోదీకి బంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata banerjee) లేఖ రాశారు. సీఎస్‌ను రిలీవ్ చేయలేమని ప్రధానికి స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన్ను వదులుకోలేమని అన్నారు. ఈ నేపథ్యంలో దిల్లీకి వచ్చి రిపోర్టు చేయాలని కేంద్రం పంపిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు.
"సీఎస్‌ను రీకాల్ చేస్తూ ఇచ్చిన ఏకపక్ష ఆదేశాలను చూసి షాక్‌కు గురయ్యా. ఈ క్లిష్ట సమయంలో బంగాల్ ప్రభుత్వం తన సీఎస్‌ను వదులుకోదు, వదలబోదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సీఎస్ పదవీకాలాన్ని మూడు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలే కొనసాగుతాయని భావించండి."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం