తెలంగాణ

telangana

బంగాల్​ అధికార భాషల జాబితాలో తెలుగు

By

Published : Dec 23, 2020, 5:28 AM IST

Updated : Dec 23, 2020, 6:21 AM IST

తెలుగును అధికార భాషగా ఆమోదించింది పశ్చిమ్​ బంగా ప్రభుత్వం. కేబినెట్​ సమావేశం అనంతరం.. విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఈ విషయం వెల్లడించారు. బంగాల్​లో ఇప్పటికే 10కిపైగా అధికార భాషలున్నాయి.

West Bengal Govt. announces Telugu as official language
బంగాల్​ అధికార భాషల జాబితాలోకి తెలుగు

బంగాల్​ అధికార భాషల్లోకి తెలుగు కూడా చేరింది. మంగళవారం నిర్వహించిన కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది మమత సర్కార్​. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ వెల్లడించారు. తెలుగును అధికార భాషగా చేయాలని బంగాల్​లోని తెలుగువారు ఎప్పటినుంచో డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో అన్నారు.

''తెలుగును అధికార భాషగా చేయాలని.. ఆ కమ్యూనిటీ ఎప్పటినుంచో డిమాండ్​ చేస్తోంది. ఖరగ్​పుర్​ సదర్​ నుంచి ఎమ్మెల్యే ప్రదీప్​ సర్కార్​ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఈ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో.. తెలుగును అధికార భాషగా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరగ్​పుర్​లో అధికంగా ఉండే తెలుగు ప్రజల డిమాండ్​ మేరకే దీనిని పరిగణనలోకి తీసుకున్నాం.''

- పార్థ ఛటర్జీ, బంగాల్​ విద్యాశాఖ మంత్రి

బంగాల్​లోని ఖరగ్​పుర్​లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 10కిపైగా అధికార భాషలున్నాయి.

ఇదీ చూడండి:'అభివృద్ధిలో బంగాల్​ టాప్​.. ఇవిగో ఆధారాలు'

Last Updated : Dec 23, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details