బంగాల్లో జరుగుతున్న ఎన్నికలు అధికారంలో మార్పు కోసం కాదని, అభివృద్ధి కోసమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వివక్ష లేని, సామరస్యంతో కూడిన ప్రభుత్వం కోసం బంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో బంగాల్లో పర్యటనలు రద్దు చేసుకున్న ప్రధాని మోదీ.. వర్చువల్గా సూరి, మాల్దా, బెర్హంపోర్, భవానిపుర్లో ప్రచారం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచి పలు సమావేశాలు నిర్వహించామని, ఈ క్రమంలో సాంకేతికత ఆధారంగా బంగాల్ ప్రజలను కలుస్తున్నట్లు చెప్పారు.
" ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వంలో మార్పు కోసం కాదు. ఈ ఎన్నికల్లో ఆశావాహ బంగాల్ను చూశాను. బంగాల్ ప్రజలు చాలా ఏళ్లుగా శాంతి, భద్రత, అభివృద్ధి, గౌరవప్రదమైన వృత్తి, సురక్షిత జీవనం, సులభతర వాణిజ్యాన్ని కావాలనుకుంటున్నారు. అక్రమ వలసలు, సిండికేట్లు, దోపిడీ వంటివి బంగాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి."