తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాజుపాత్రలో రూ.12 కోట్ల విలువైన పాము విషం.. ఎక్కడిది? - వరిపొలంలో పాము విషం

వరి పొలాల్లో ఓ గాజు పాత్రలో అక్రమంగా నిల్వ చేసిన పాము విషాన్ని సరిహద్దు భద్రతా దళ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ విషం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని చెప్పారు.

sanke venom seized
పాము విషం

By

Published : Oct 24, 2021, 7:01 PM IST

బంగాల్​లో దాదాపు రూ.12 కోట్లు విలువ చేసే పాము విషాన్ని అక్రమంగా నిల్వ చేసి ఉంచగా.. సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) పట్టుకుంది. వరిపొలంలో ఓ గాజు పాత్ర​లో భద్రపరచగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ దినాజ్​పుర్ జిల్లా కుమార్​గంజ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుమార్ గంజ్​కు చెందిన 61 బెటాలియన్​ జవాన్లు ఈ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఫ్రాన్సులో తయారైన గాజుపాత్ర

బీఎస్​ఎఫ్ జవాన్లు శనివారం రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా ఈ విషంతో ఉన్న గాజు పాత్రను గుర్తించారు. అదే రాత్రి దీన్ని బలుర్​ఘాట్ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే.. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. ఈ గాజు పాత్ర ఫ్రాన్సులో తయారైందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

గాజుపాత్రలో పాము విషం

ABOUT THE AUTHOR

...view details