మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా ద్వయాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొని వరుసగా మూడోసారి బంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు దీదీ. బంగాల్ ముద్దు బిడ్డ తానే అని మరోమారు రుజువు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు కాలికి గాయమైనా.. వీల్ ఛైర్పైనే ప్రచారం నిర్వహించి తృణమూల్ కాంగ్రెస్ను విజయ తీరాలకు చేర్చారు. బంగాల్ ప్రజలు దీదీని ఇంతగా ఆదరించడానికి, విశ్వసించడానికి కారణం.. ఆమె ప్రజల కోసం ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన పోరాటాలే.
1970-80లో బంగాల్ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన మమత... అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 1984లో బంగాల్ జాదవ్పుర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1991, 1996లో కోల్కతా దక్షిణ్ నుంచి బరిలోకి ఎంపీగా జయకేతనం ఎగురవేశారు.
1998లో టీఎంసీ స్థాపన..