తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నందిగ్రామ్​ నుంచి మమత నామినేషన్​ - మమతా బెనర్జీ నామినేషన్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్​ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మధ్యాహ్నం నామినేషన్​ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు తృణమూల్​ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడం వల్ల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

west bengal cm mamata benarjee files nomination
బంగాల్​ దంగల్​: నందిగ్రామ్​ నుంచి దీదీ నామినేషన్​

By

Published : Mar 10, 2021, 2:08 PM IST

Updated : Mar 10, 2021, 2:32 PM IST

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నందిగ్రామ్​ నియోజకవర్గం నుంచి నామినేషన్​ దాఖలు చేశారు. తృణమూల్​ కార్యకర్తల సమక్షంలో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఎన్నికల అధికారులకు బుధవారం మధ్యాహ్నం నామపత్రాలు సమర్పించారు. ఈ సమయంలో టీఎంసీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.

నందిగ్రామ్​ నుంచి దీదీ నామినేషన్​
నందిగ్రామ్​ నుంచి దీదీ నామినేషన్​
నందిగ్రామ్​ నుంచి దీదీ నామినేషన్​

ఎన్నికలకు ముందు తృణమూల్​ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారి కూడా ఇక్కడి నుంచే బరిలో నిలుస్తుండం వల్ల పోటీ రసవత్తరంగా మారనుంది.

శివాలయంలో పూజలు..

శివాలయంలో దీదీ పూజలు

నామినేషన్​కు ముందు నందిగ్రామ్​లోని శివాలయాన్ని సందర్శించారు మమతా బెనర్జీ. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివాలయంలో దీదీ పూజలు
శివాలయంలో దీదీ పూజలు
Last Updated : Mar 10, 2021, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details