తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేతాజీ జయంతి: బంగాల్​లో దీదీ భారీ ర్యాలీ - నేతాజీని కొనియాడిన మమతా బెనర్జీ

ప్లానింగ్​ కమిషన్​, భారత ఆర్మీ ఏర్పాటులో నేతాజీ పాత్ర కీలకమైందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ జయంతి​ సందర్భంగా బంగాల్​లో భారీ ర్యాలీ చేపట్టారు.

West Bengal CM Mamata Banerjee leads a march
పరాక్రమ్ దివస్- బంగాల్​లో 'దీదీ' భారీ ర్యాలీ

By

Published : Jan 23, 2021, 1:10 PM IST

Updated : Jan 23, 2021, 1:19 PM IST

స్వాతంత్య్రానికి ముందు భారత ఆర్మీ ఏర్పాటు చేసేందుకు నేతాజీ సుభాస్ చంద్రబోస్​ చేసిన కృషి అనిర్వచనీయమని అన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్లానింగ్​ కమిషన్​ ఏర్పాటులోనూ బోస్​ పాత్ర కీలకమని గుర్తుచేశారు.

స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా బంగాల్​లో భారీ ర్యాలీ నిర్వహించిన మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్​కతాలోని శ్యామ్​ బజార్​ నుంచి రెడ్​ రోడ్​ వరకు వేలాది మంది వెంట రాగా 6 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.

కోల్​కతాలోని నేతాజీ విగ్రహం

ర్యాలీకి ముందు ట్విట్టర్‌లో నేతాజీకి నివాళి అర్పించిన మమత.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. నేతాజీ 125వ జయంతి కార్యక్రమాన్ని 2022 జనవరి 23 వరకు నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు మమత తెలిపారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలను నేతాజీకి అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:నేడు కోల్​కతాకు మోదీ- 'పరాక్రమ్​ దివస్'​కు హాజరు

Last Updated : Jan 23, 2021, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details