తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ లైవ్​​: సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్​ - బంగాల్​ దంగల్​

West Bengal assembly Elections
బంగాల్​ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్

By

Published : Apr 10, 2021, 6:58 AM IST

Updated : Apr 10, 2021, 5:40 PM IST

17:39 April 10

బంగాల్​ నాలుగో విడత ఎన్నికల్లో ఓటింగ్​కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆరు గంటలకు ఓటింగ్ ముగియనుంది. అప్పటివరకు లైన్​లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తారు.

15:54 April 10

పోలింగ్ బూత్ వద్ద గంగూలీ

ఓటేసిన దాదా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లా బెహలాలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్​ బూత్​లో ఓటేశారు. 

15:46 April 10

భారీగా పోలింగ్

బంగాల్​లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. 44 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 66.76 శాతం పోలింగ్ నమోదైంది.

13:50 April 10

మధ్యాహ్నం 1.37 గంటల వరకు 53% పోలింగ్​

బంగాల్​ నాలుగో విడత ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. ఓటింగ్​లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.37 గంటల వరకు 52.89 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.  

ఘర్షణ తలెత్తి నలుగురు మృతి చెందిన క్రమంలో ఇవాళ కోల్​కతాలో ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు

13:44 April 10

కూచ్​బెహర్​ ఘర్షణ ప్రాంతానికి మమత!

బంగాల్​ నాలుగో విడత ఎన్నికల వేళ కూచ్​బెహర్​ జిల్లాలోని సీతల్​కుచి నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నలుగురు టీఎంసీ మద్దతుదారులుగా టీఎంసీ పేర్కొంది. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మృతుల కుటుంబాలను కలవనున్నట్లు సమాచారం.

13:22 April 10

సీతల్​కుచిలో ఓటింగ్​​​ వాయిదా!

హింసాత్మక ఘటనల నేపథ్యంలో కూచ్​బెహార్​ జిల్లా సీతల్​కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రం 126లో ఓటింగ్​ వాయిదా వేయాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ప్రత్యేక పరశీలకుల మధ్యంతర నివేదిక ప్రకారం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి స్థాయి నివేదికను ఈరోజు 5 గంటల లోపు ప్రధాని ఎన్నికల అధికారికి సమర్పించాలని ఆదేశించింది.  

11:46 April 10

11.30 గంటల వరకు 33.98% పోలింగ్​

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​లో భాగంగా 44 నియోజకవర్గాల్లో ఉదయం 11.30 గంటల వరకు 33.98 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫలకటా నియోజకవర్గంలో అత్యధికంగా 40.45 శాతం ఓటింగ్​ నమోదైనట్లు తెలిపింది. జాదవ్​పుర్​లో అత్యల్పంగా 21.23 శాతం ఓటింగ్​ నమోదైందని పేర్కొంది. 

11:29 April 10

కూచ్​బెహార్​లో బలగాల కాల్పులు- నలుగురు మృతి!

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​ జరగుతున్న వేళ కూచ్​బెహార్​ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని సీతల్​కుచీ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తగా..  అల్లరి మూకలపై ఎన్నికల విధుల్లో ఉన్న సీఐఎస్​ఎఫ్ బలగాలు​ కాల్పులు జరిపాయి. బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను కూచ్​బేహార్​లోని మాతబంగా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

మృతులు హమిదుల్​ హక్​, మోనిరుల్​ హక్​, సామ్యిల్​ మియా, అమ్జాద్​​ హొస్సేన్​లుగా గుర్తించారు. వారంతా తృణమూల్​ కాంగ్రెస్​ మద్దతుదారులుగా తెలుస్తోంది.  

ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

11:19 April 10

ఉదయం 11 గంటల వరకు 16.65% పోలింగ్​

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​ జోరుగా సాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.  

10:47 April 10

భాజపా నేత లాకెట్​ ఛటర్జీ కారుపై దాడి

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​  జరుగుతున్న వేళ హూగ్లీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా నేత లాకెట్​ ఛటర్జీ కారుపై దాడి చేశారు స్థానికులు. కారును అడ్డుకునే క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది.

ఇదే ప్రాతంలో ఎన్నికల కవరేజీకి వెళ్లిన ఓ మీడియా వాహనాలపైనా దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.  

10:34 April 10

కూచ్​బెహర్​ జిల్లాలో కాల్పులు

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​లో కాల్పులు కలకలం సృష్టించాయి. కూచ్​బెహర్​ జిల్లా షిటల్​కుచిలోని పతంతులి ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. మృతుడు ఓటు వేసేందుకు క్యూలైన్​లో వేచి ఉన్న సమయంలో అతనిపై కాల్పులకు పాల్పడ్డారు. 

10:00 April 10

16 శాతం..

బంగాల్​ నాలుగో దశ పోలింగ్​ జోరుగా సాగుతోంది. కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 15.85 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల కమిషన్​ వెల్లడించింది. 

08:45 April 10

పోలింగ్​ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు

బంగాల్​ నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్​ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు ప్రజలు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బారులుతీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్​ నియోజకవర్గంలోని కుల్బేరియా ధర్మతలా ఎఫ్​పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బారులు తీరారు ఓటర్లు.  

అలిపుర్దౌర్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓ మహిళ ఓటు వేసేందుకు సాయం చేశారు భద్రతా సిబ్బంది. ఆమెను ఎత్తుకుని బూత్​లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు.  

08:37 April 10

హెల్మెట్​తో పోలింగ్​ కేంద్రానికి టీఎంసీ అభ్యర్థి

కూచ్​ బెహర్​ జిల్లా నటబారి నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి రవింద్ర నాత్​ ఘోష్​ హెల్మెట్​ ధరించి పోలింగ్​ కేంద్రానికి వచ్చారు. ఎదైనా అనుకోని సంఘటన ఎదురైతే దానిని నుంచి తప్పించుకునేందుకే తాను హెల్మెట్​తో పోలింగ్​ బూత్​కు వచ్చినట్లు చెప్పారు.  

కోల్​కతాలోని తొల్లిగంజ్​ భాజపా అభ్యర్థి బాబుల్​ సుప్రియో.. గాంధీ కాలనీలోని భారతి బాలిక విద్యాలయంలోని కేంద్రానికి వచ్చారు. తమ ఏజెంట్లను లోపలికి అనుమతించటం లేదని అధికారులపై మండిపడ్డారు. ఆన్​లైన్​లో వివరాలు చూపించాక ప్రస్తుతం అనుమతించినట్లు చెప్పారు. మమతా బెనర్జీ, టీఎంసీని అధికారం నుంచి తొలగించటం అతిపెద్ద సవాల్​గా పేర్కొన్నారు. ఆమె చేసే అన్ని పనులకు టీఎంసీ అభ్యర్థి అరూప్​ బిస్వాస్​ కుడి బుజంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాద పరిస్థితులను మార్చటం అతిపెద్ద సవాల్​గా మారిందన్నారు.  

08:07 April 10

'యువత తరలిరండి.. ఓటేయండి' 

బంగాల్ నాలుగో విడత ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఓటేయాలని సూచించారు. 

08:00 April 10

భాజపాపై ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు

భాజపాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది తృణమూల్​ కాంగ్రెస్​. సితల్కుచి, నతల్​బరీ, తుఫాంగంజ్​, దిన్​హటా వంటి పోలింగ్​ బూత్​ల వద్ద భాజపా గూండాలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించింది. బూత్​ల్లోకి టీఎంసీ ఏజెంట్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది.  

మరోవైపు.. ఓటింగ్​లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్​ బూత్​లకు చేరుకుంటున్నారు ఓటర్లు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్​ నియోజకవర్క భాజపా అభ్యర్థి సౌమి హతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భంగర్​లోని పంచూరియా ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. 

06:38 April 10

లైవ్​: బంగాల్​ నాలుగో దఫా పోలింగ్​

బంగాల్​ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్​ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు ప్రజలు. ఇప్పటికే పలు కేంద్రాల ముందు బారులుతీరారు ప్రజలు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.  

44 నియోజకవర్గాల్లో ఓటింగ్​ జరుగుతోంది. మొత్తం 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

భారీ భద్రత

ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 789 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఒక్కో కంపెనీలో 100 మంది సభ్యులు ఉంటారు. కూచ్​ బెహార్​ నియోజకవర్గానికి అత్యధికంగా 187 కంపెనీల సీఏపీఎఫ్​ బలగాలను పంపింది. ఇటీవల వివిధ పార్టీల నేతలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Apr 10, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details