బంగాల్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఏనుగు పిల్లను రక్షించారు గ్రామస్థులు. ఏనుగును తాకకూడదనే నిబంధనతో.. ఆ బోరుబావిలో ఎండుగడ్డి వేస్తూ, వెదురు కర్రల సాయంతో గజరాజును బయటకు తీశారు.
ఇలా పడింది!
ఝాడ్గ్రామ్ అటవీ ప్రాంతానికి చెందిన ఓ ఏనుగుల గుంపు.. మణిక్పారాలోని దల్కాటి గ్రామ పరిసరాల్లో సంచరిస్తుండేదని స్థానికులు తెలిపారు. సుమారు 30 నుంచి 35 గజరాజులున్న ఈ గుంపులోంచి ఓ గున్న ఏనుగు పాడుబడ్డ బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ ఏనుగు ఘీంకారాలు చేయగా.. విషయం స్థానికులకు తెలిసింది. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.