కట్టుదిట్టమైన భారీ భద్రత మధ్య బంగాల్‌లో ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదున్నర గంటల వరకూ 75శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఎం మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సాయంత్ర 4గంటల ప్రాంతంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటువేశారు. గతంలో రెండుసార్లు భవానీపూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన దీదీ ఈసారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి బరిలో దిగారు. ఈ విడతలో 34 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరిగింది.
బంగాల్‌లో ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్ - today wb election
బంగాల్ ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో సాయంత్రం ఐదున్నర గంటల వరకు 75శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది.
బంగాల్‌లో ప్రశాంతంగా ఏడో విడత పోలింగ్
గత ఆరు విడతల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొన్న కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో 796కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టారు. ఈనెల 29న చివరి విడత పోలింగ్ జరగనుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:బంగాల్: మధ్యాహ్నానికి 55% పోలింగ్