తెలంగాణ

telangana

కరోనాపై ఇది రెండో పెద్ద యుద్ధం: మోదీ

By

Published : Apr 11, 2021, 10:14 AM IST

Updated : Apr 11, 2021, 11:20 AM IST

కరోనా టీకా తీసుకోవడంలో ఇతరులకు సాయం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్​ కార్యక్రమాన్నిప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది కరోనాపై జరుపుతున్న రెండో పెద్ద పోరు అని పేర్కొన్నారు.

'Tika Utsav'
కరోనాపై ఇది రెండో పెద్ద యుద్ధం: మోదీ

కరోనా టీకా తీసుకోవడంలో ఇతరులకు సాయం అందించాలని ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. నేటి నుంచి ఏప్రిల్​ 14 వరకు దేశవ్యాప్తంగా 'టీకా ఉత్సవ్​' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న రెండో పెద్ద యుద్ధమే ఈ కార్యక్రమం అని అభివర్ణించారు. ఈ మేరకు నాలుగు సూత్రాలను పాటించాలి ప్రజలకు మోదీ సూచించారు.

"టీకా తీసుకోవడంలో సహకారం అందించాలి. కొవిడ్​ చికిత్స పొందటంలో ఇతరులకు సాయంచేయాలి. మాస్కులు ధరిస్తూ ఇతరులనూ మాస్కుధరించేలా ప్రోత్సహించాలి. ఎవరికైనా వైరస్​ సోకితే అక్కడి ప్రాంతాన్ని స్వల్ప స్థాయి కంటెయిన్​మెంట్​ జోన్​గా ఏర్పాటు చేయాలి. ఈ నాలుగు సూత్రాలను పాటించాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. వీటిపైనే మనం విజయం ఆధారపడి ఉంటుంది. "

- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

అర్హులైన ప్రతివారు వ్యాక్సిన్​ తీసుకోవాలని మోదీ కోరారు. వ్యాక్సినేషన్​ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క డోసు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఇటీవల అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని.. టీకాల పంపిణీని వేగవంతం చేసేందుకు 11 నుంచి 14 వ తేదీ వరకూ 'టీకా ఉత్సవ్' కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రధాని సూచనల మేరకు 'టీకా ఉత్సవ్' చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి.

ఇదీ చూడండి:జ్యోతిరావు పూలేకు ప్రధాని మోదీ నివాళులు

Last Updated : Apr 11, 2021, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details