అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జె.ఆస్టిన్.. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జై శంకర్ సమావేశమయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులపై విస్తృత చర్చలు జరిగినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని ఆస్టిన్ తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సంబంధం ఇరు దేశాలకే కాక.. ప్రపంచంలోని ఇతర దేశాలకూ కీలకమని జైశంకర్ ఉద్ఘాటించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక పరిస్థితులపైనా చర్చ జరిగినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ, మానవ హక్కులు ఎంతో ముఖ్యమైనవని.. వీటిని కాపాడేందుకు ఉన్నత విలువలతో ముందుకు వెళ్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు.