తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే - Weekly Horoscope

Weekly Horoscope ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

ఈ వారం మీ రాశిఫలం
ఈ వారం మీ రాశిఫలం

By

Published : Aug 14, 2022, 2:57 AM IST

Updated : Aug 14, 2022, 11:38 AM IST

ఓర్పుతో లక్ష్యాలను పూర్తిచేయాలి. కాలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరించాలి. శాంతచిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవప్రయత్నం చేయండి, కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.

అదృష్టకాలం. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యకార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలుంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి సూచితం. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లోవారి సూచనలు విజయాన్నిస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.

ఆర్థికాంశాలు బాగుంటాయి. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలమిది. శాంతస్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. నవగ్రహధ్యానం శుభప్రదం.

శుభకాలం నడుస్తోంది. అభీష్టసిద్ధి విశేషంగా ఉంది. సకాలంలో పనుల్ని పూర్తిచేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. నూతన వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం. గృహ వాహనాది యోగాలున్నాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచిది.

మనోబలంతో పని ప్రారంభించండి, విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢసంకల్పం, శాంతస్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. కాలం మిశ్రమంగా ఉంది. ఆంజనేయస్వామిని ధ్యానించండి.

ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. ఆవేశపరిచేవారుంటారు. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకెళ్లండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగుతాయి. ఇష్టదేవతను స్మరించండి, కుటుంబం ఆనందంగా ఉంటుంది.

ఉద్యోగవ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపూ గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలమిది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఉంది, మితభాషణం మేలు. శుభవార్త వింటారు. నవగ్రహస్తుతి శాంతినిస్తుంది.

ఉద్యోగం బాగుంటుంది. పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యయం తగ్గించి సంపద పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక సంఘర్షణకు లోనవవద్దు. వారం మధ్యలో ఒక ఆపద నుంచి బయటపడతారు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. సూర్యస్తుతి మంచిది.

అభీష్టసిద్ధి విశేషంగా ఉంది. లక్ష్యాన్ని త్వరగా చేరతారు. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రశంసలు ఉంటాయి. అపోహలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థికవృద్ధి ఉంటుంది. మంచి భవిష్యత్తుకోసం కష్టపడాలి. ఇష్టదేవతను స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.

పరీక్షా కాలమిది. ఆవేశం పనికిరాదు. మితంగా మాట్లాడాలి. పొరపాటు జరిగితే నష్టం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిందారోపణలు చేసేవారున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శాంతంగా ఉండాలి. వృథా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. నవగ్రహస్తుతి మేలుచేస్తుంది.

ఉద్యోగం బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. కాలం సహకరిస్తోంది. వ్యాపారంలోనూ అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోగలరు. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కుటుంబపరంగా కలిసివస్తుంది. శుభవార్త వింటారు. విష్ణుధ్యానం ఆనందాన్నిస్తుంది.

శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృథా కాకుండా చూసుకోవాలి. ధనలాభం సూచితం. చెడు ఆలోచనలు రానీయవద్దు. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్టకార్యాలు పూర్తి చేస్తారు. సూర్యారాధన ఉత్తమం.

Last Updated : Aug 14, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details