శుభ యోగాలున్నాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. వ్యాపారబలం అద్భుతంగా ఉంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. భూగృహ ప్రయత్నాల్లో పురోభివృద్ధి సూచితం. ఎదురుచూస్తున్న పని ఒకటి వెంటనే
అవుతుంది. అవరోధాలు తొలగుతాయి. స్నేహితుల వల్ల శాంతి లభిస్తుంది. ప్రయాణలాభం సూచితం. ఇష్టదైవ ప్రార్థన మంచిది.
శుభఫలితం ఉంది. గత వైభవం లభిస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగంలో తెలియని అవరోధం ఒకటి ఎదురవుతుంది. వివాదాలకు అవకాశం ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ధర్మం వీడవద్దు. ఆదిత్యహృదయం చదివితే మేలు.
కాలం వ్యతిరేకంగా ఉంది. సంక్లిష్ట స్థితి ఎదురవుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. ప్రతి అడుగూ నిదానంగా వేయండి. ధర్మమార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలు పాటించండి. ముఖ్యమైన, పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. వారాంతంలో మంచి వార్త వింటారు. ఇష్టదైవప్రార్థన శుభప్రదం.
బుద్ధిబలంతో సుస్థిరమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. వ్యాపారలాభాలు విశేషంగా ఉన్నాయి. దైవానుగ్రహంతో లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సామరస్య ధోరణి మేలు. ఆవేశపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు రానీయకూడదు. వారాంతంలో శుభం జరుగుతుంది. సూర్యనమస్కారం మంచిది.
ఉద్యోగఫలితం శుభప్రదం. అధికారుల ప్రశంసలు పొందుతారు. అభివృద్ధి సూచితం. అభిమానించేవారు ఉన్నారు. వ్యాపారంలో తగిన లాభముంటుంది. చంచలత్వం పనికిరాదు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. ఒక చిక్కుముడి వీడుతుంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. విష్ణుమూర్తిని స్మరించండి, శుభం జరుగుతుంది.
అదృష్టయోగముంది. ఉద్యోగంలో పదవీలాభం సూచితం. పెద్దల ప్రశంసలుంటాయి. ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. భూ, వాహన శుభయోగాలున్నాయి. సుఖసంతోషాలతో కాలం గడుస్తుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని పూర్తిచేస్తారు. వ్యాపారంలో విఘ్నం ఎదురవకుండా జాగ్రత్త పడాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది.