తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా ? - వారఫలం నవంబర్​ 13 నుంచి 19 వరకు

Weekly Horoscope : నవంబరు 13 నుంచి నవంబరు 19 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly horoscope from nov 13 to 19
weekly horoscope from nov 13 to 19

By

Published : Nov 13, 2022, 6:38 AM IST

స్థిరచిత్తంతో పనుల్ని పూర్తిచేయండి. ఉద్యోగంలో మిశ్రమంగా ఉంటుంది. విఘ్నాలను చాకచక్యంగా అధిగమించాలి. తొందరవద్దు. మంచి గుర్తింపు పొందగలరు.మిత్రుల ద్వారా లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యుల సహకారం తీసుకోండి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. సూర్య దేవుణ్ణి ప్రార్థించండి, కార్యసిద్ధి ఉంటుంది.

ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారలాభం విశేషం. నూతన ప్రయత్నాల్లో పురోగతి గోచరిస్తోంది. అదృష్ట ఫలాలు ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూలం. బంధుమిత్రుల అండ లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.

మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. అంతా మన మంచికే అన్న ధోరణి మేలు. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది. పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రద్ధ చూపాలి. సౌమ్యంగా సంభాషించాలి. కొన్ని పనులను వాయిదా వేయగలిగితే ఒత్తిడి తగ్గుతుంది. సమష్టి నిర్ణయం మేలుచేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. రవిశ్లోకం చదవండి, కార్యసిద్ధి లభిస్తుంది.

వ్యాపారబలం అద్భుతం. కార్యసిద్ధి లభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉంటాయి. అధిక ధనలాభం సూచితం. భూ, గృహ యోగాలు అనుకూలిస్తాయి. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. చంచల నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఒక పనిలో విఘ్నం తొలగుతుంది. జీవితాశయం నెరవేరుతుంది. సూర్యారాధన శ్రేష్ఠం.

అత్యంత శుభకాలం నడుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. అభివృద్ధిపైనే దృష్టి పెట్టండి, తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. క్రమంగా సుస్థిరత లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ పెట్టండి. ఇష్టదైవదర్శనం మేలుచేస్తుంది.

వ్యాపారం లాభప్రదం. సకాలంలో నిర్ణయం తీసుకోండి, అదృష్టవంతులవుతారు. కాలం అనుకూలిస్తుంది. అవకాశాల్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఒత్తిడి పనికిరాదు. పనుల్ని వాయిదా వేయవద్దు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

పనులు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. నిందలు మోపేవారుంటారు. ధైర్యంగా సమాధానమివ్వాలి. చేయని పనికి బాధ్యత వహించాల్సి రావచ్చు. సంయమనం అవసరం. వ్యాపారంలో జాగ్రత్త. వారం మధ్యలో స్పష్టత వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, ఆశయం నెరవేరుతుంది.

శుభకాలం నడుస్తోంది. ఉద్యోగంలో పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. లక్ష్యాన్ని చేరతారు. ఈ వారం సంతృప్తినిస్తుంది. మాటలో స్పష్టత, సౌమ్యత అవసరం. చంచలత్వం వద్దు. ఒక పని చేతిదాకా వస్తుంది. కృషిని బట్టి కార్యసిద్ధి ఉంటుంది. ధర్మమార్గంలో ప్రయత్నించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.

ఉద్యోగ, వ్యాపార యోగాలు బాగున్నాయి. వారం మధ్యలో బ్రహ్మాండమైన ఫలితం సూచితం. సంకల్పసిద్ధి, సద్గోష్టి లభిస్తాయి. నలుగురినీ కలుపుకు వెళ్లాలి. సాంకేతిక లోపాలు రానివ్వద్దు. ఎదురుచూస్తున్న పని దిగ్విజయంగా పూర్తవుతుంది. ప్రతి విషయాన్నీ అందరికీ చెప్పవద్దు. కోరిక నెరవేరుతుంది. ఇష్టదైవారాధన కార్యసిద్ధినిస్తుంది.

మంచికాలం. తలపెట్టిన కార్యాలు పూర్తి అవుతాయి. శుభయోగం ఉంది. అనేక విధాలుగా పైకి రావడానికి అనుకూలమైన కాలమిది. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. మిత్రుల వల్ల లాభపడతారు. వ్యాపారంలో బాగా కష్టపడాలి. ప్రయాణాల్లో లాభముంటుంది. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది.

అదృష్టకాలం నడుస్తోంది. గురుగ్రహం సహకరిస్తోంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారపరంగా శ్రమ పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అవసరాలకు ధనం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే సందర్భాలుంటాయి. సమష్టి నిర్ణయం శక్తినిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. లక్ష్యానికి చేరువవుతారు. సూర్యనమస్కారం శుభప్రదం.

శుభయోగం ఉంది. నమ్మకంతో పని మొదలుపెట్టండి. ముఖ్యకార్యాల్లో ఆలస్యం పనికిరాదు. ఉద్యోగ వ్యాపారాల్లో కృషి పెంచాలి. ఆర్థికాంశాలు బాగున్నాయి. కొందరివల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది. పట్టుదలతో చేసే పనులు స్థిరమైన భవిష్యత్తును ఇస్తాయి. మొహమాటంతో లేని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. విష్ణుస్తుతి మంచిది.

ఇదీ చదవండి:హిమగిరిలో జోరుగా పోలింగ్ బారులు తీరిన ఓటర్లు

ప్రశాంతంగా హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details