తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? (జులై 17 - 23) - WEEKLY HOROSCOPE latest news

Weekly Horoscope: ఈ వారం (జులై 17 - 23) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

వారం
వారం

By

Published : Jul 17, 2022, 5:16 AM IST

వ్యాపారంలో సత్ఫలితాలుంటాయి. కోరుకున్న ధనం లభిస్తుంది. పట్టుదలా ఆత్మవిశ్వాసం గొప్పవారిని చేస్తాయి. ఒక్కోసారి పరీక్షాకాలంగా అనిపిస్తుంది. శాంతచిత్తంతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలగుతాయి. దైవచింతన, సౌమ్యసంభాషణ మేలుచేస్తాయి. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. సూర్య నారాయణమూర్తిని దర్శిస్తే కలిసివస్తుంది.

ఉత్తమకాలం నడుస్తోంది. శుభయోగాలు ఉన్నాయి. మంచిపేరు సంపాదిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. స్థిరత్వం వస్తుంది. సుఖమైన జీవితం లభిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆంజనేయస్వామిని స్మరించండి, మేలు జరుగుతుంది.

వ్యాపారబలం, ధనయోగం అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ శుభఫలితం వస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోవాలి. సత్యానికే కట్టుబడి ఉండండి. ఆటంకాలు తొలగుతాయి. కొందరివల్ల గందరగోళ స్థితి ఏర్పడుతుంది. గత సంఘటనలు కొన్ని ఇబ్బందిపెడతాయి. ఓర్పుతో ధైర్యంగా పనిచేయాలి. నరసింహస్వామిని స్మరిస్తే మేలు.

ముఖ్యకార్యాల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడవద్దు. తెలియనివాటిల్లో తలదూర్చవద్దు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కొందరివల్ల ఇబ్బంది ఎదురైనా దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరతారు. ఆర్థికంగా మిశ్రమకాలం, ఖర్చు తగ్గించండి. శివస్మరణ చేయండి, శుభవార్త వింటారు.

ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఒక ప్రణాళికతో బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయండి. ధనలాభం ఉంది. సన్మార్గంలోనే అభివృద్ధి సూచితం. అర్హతకు మించి పనులు చేయవద్దు. తెలియని విఘ్నాలు ఉంటాయి. మితభాషణం అవసరం. ధర్మచింతన మంచిది. దుర్గాదేవిని ధ్యానించండి, పరిస్థితులు చక్కబడతాయి.

బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంది. మంచి ఉద్దేశంతో పని ప్రారంభించండి, కలసివస్తుంది. చక్కని ఆలోచనాసరళి గొప్ప విజయానికి బాట వేస్తుంది. సత్యనిష్ఠ అవసరం. కుటుంబపరంగా కలసికట్టుగా ఉండాలి. అవరోధాలు చికాకుపెట్టినా ఉద్యోగ వ్యాపారాలు మంచి ఫలితాన్నిఇస్తాయి. కాలం సానుకూలం. శుక్రశ్లోకం చదివితే మంచిది.

ఉద్యోగం బాగుంటుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కన్పిస్తున్నాయి. చంచల స్వభావం లేకుండా ప్రణాళికతో పనిచేయండి. కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయస్వామిని స్మరించండి, మనశ్శాంతి లభిస్తుంది.

శ్రేష్ఠమైన కాలం. అభీష్టం సిద్ధిస్తుంది. శ్రద్ధగా చేసే పనులు బ్రహ్మాండమైన ఫలితాన్నిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఉత్తమఫలితం ఉంటుంది. సద్భావనతో ముందుకు సాగితే బంగారు జీవితం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దోషాలు తొలగుతాయి. అదృష్టయోగం సూచితం. సమష్టి కృషి శక్తినిస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది.

కాలం అనుకూలంగా లేదు. సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. యథాలాపంగా ఏ పనీ చేయవద్దు. తెలయని ఆటంకాలుంటాయి. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. చెడు ఆలోచించవద్దు. ఈర్ష్యపడేవారు ఉంటారు. సున్నితంగా స్పందించాలి. ఆర్థిక విషయాల్లో తొందర పనికిరాదు. ఇష్టదేవతాధ్యానం మేలుచేస్తుంది.

శ్రద్ధగా పనిచేయండి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకపోయినా విమర్శించే వారుంటారు. నిదానంగా కార్యసిద్ధి లభిస్తుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తిచేయాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఆవేశపరిచే సన్నివేశాలుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇంట్లోవారి సూచనలు అవసరం. నవగ్రహస్తోత్రం చదవండి, శుభం జరుగుతుంది.

అత్యుత్తమ కాలం. ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు స్థిరమైన భవిష్యత్తునిస్తాయి. ధనధాన్య లాభాలున్నాయి. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలోనూ ఉన్నతస్థితి లభిస్తుంది. సమాజానికి మేలుచేసే పనులు చేపట్టండి. లక్ష్మీ ఆరాధన శుభాన్నిస్తుంది.

ఆర్థికాంశాలు బాగుంటాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. కష్టమైనా పనులు పూర్తిచేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. స్వయంకృషితో ముందుకెళ్లాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పొరపాట్లు జరగకుండా చూడాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, ఆత్మస్థైర్యం అలవడుతుంది.

ABOUT THE AUTHOR

...view details