తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? - weekly horoscope

Weekly Horoscope: అక్టోబర్​ 16 నుంచి 22 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly horoscope
weekly horoscope

By

Published : Oct 16, 2022, 7:54 AM IST

Weekly Horoscope: అక్టోబర్​ 16 నుంచి 22 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

శుభప్రదమైన సమయం. పనులు పూర్తవుతాయి. నిర్ణయాలను ధైర్యంగా అమలుచేయండి. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవంతో నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టాలి. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, మేలు జరుగుతుంది.

శ్రమ ఫలిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ముఖ్యకార్యాలను శ్రద్ధగా పూర్తిచేయండి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. తోటివారి సూచనలు అవసరం. ఓర్పుగా ఉండండి. విజయం చేరువలోనే ఉంటుంది. వ్యాపారం మిశ్రమం. అవసరాలకు ధనం లభిస్తుంది. సూర్యారాధన శుభప్రదం.

మనోబలంతో పని ప్రారంభించండి, అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారబలం అద్భుతం. తెలివిగా ప్రణాళికలు రూపొందించండి. మంచి జరుగుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీ కృషి సఫలమవుతుంది. కుటుంబపరంగా కలహాలకు అవకాశముంది. ఆర్థికాంశాలు బాగుంటాయి. ఉద్యోగంలో జాగ్రత్త. సూర్యనారాయణుడిని స్మరిస్తే మంచిది.

ఉత్తమకాలం. సాహసోపేతమైన కార్యాల్లో విజయం ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. ఇష్టంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. అదృష్టయోగముంది, తగినంత కృషి అవసరం. ధనధాన్యలాభం సూచితం. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇష్టదేవతాస్మరణ మనశ్శాంతినిస్తుంది.

ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అంచనాలకు తగ్గ ఫలితం వస్తుంది. వ్యాపారంలో లాభపడతారు. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. ధర్మబద్ధంగా చేసే పనులు లక్ష్యాన్ని చేరుస్తాయి. జీవితం సంతృప్తికరంగా నడుస్తుంది. సమష్టి నిర్ణయం శక్తినిస్తుంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. లక్ష్మీఅష్టోత్తరంతో శుభాలు జరుగుతాయి.

సకాలంలో పనులు పూర్తిచేస్తే అధిక లాభముంటుంది. నూతన ప్రయత్నం సఫలమవుతుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. సందేహాస్పద విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. అపార్థాలకు దూరంగా ఉండాలి. గౌరవం లభిస్తుంది. మహాలక్ష్మీదేవిని స్మరించండి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

ఏకాగ్రచిత్తంతో పని ప్రారంభించండి, అభీష్టం సిద్ధిస్తుంది. చెడు ఆలోచనలు రానీయవద్దు. సమష్టి కృషి అవసరం. ఉద్యోగంలో జాగ్రత్త. అనుకున్నది సాధించేవరకూ శ్రమిస్తూనే ఉండాలి. పనులను మధ్యలో ఆపవద్దు. కాలం వ్యతిరేకంగా ఉంది. చిన్న పొరపాటు జరిగినా నష్టం ఉంటుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.

శ్రేష్ఠమైన కాలం. ఇప్పుడు చేసే పనులు శక్తినిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాలవల్ల విజయం లభిస్తుంది. సద్భావనతో పని మొదలుపెట్టండి. మీరు ఊహించిన విధంగానే జీవితం ఉంటుంది. అదృష్టయోగముంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఎటుచూసినా శుభాలే గోచరిస్తున్నాయి. లక్ష్మీదేవిని స్మరించండి, ఆనందం లభిస్తుంది.

కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో శుభఫలితముంది. అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. కృషి ఫలిస్తుంది. బాధ్యతలను త్వరగా పూర్తిచేసే శక్తి లభిస్తుంది. నూతన కార్యాల్లో లాభముంటుంది. వ్యాపారంలో జాగ్రత్త. తొందర నిర్ణయాల వల్ల ఖర్చు పెరుగుతుంది. భూగృహప్రాప్తి సూచితం. ఇష్టదైవాన్ని దర్శించండి.

మనోబలంతో పనిచేయాలి. తెలియని విఘ్నాలున్నాయి. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరాలి. స్పష్టంగా మాట్లాడాలి. తోటివారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారలాభం సూచితం. ధర్మచింతన మేలు చేస్తుంది. ఇంట్లోవారి సూచనలు పాటించాలి. సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టదేవతను దర్శించండి, శుభం జరుగుతుంది.

అదృష్ట యోగముంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వల్ప అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకునే సామర్థ్యం లభిస్తుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. బాధ్యతలు మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాయి. ధర్మ దేవతానుగ్రహం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. సరైన నిర్ణయంతో అందరినీ కలుపుకుని పోవాలి. గణపతి స్మరణ శుభప్రదం.

ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో సహనం అవసరం. ధర్మమార్గాన్ని వదలవద్దు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. తొందరపడవద్దు. స్పష్టతతో లక్ష్యాన్ని సాధించాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమను బట్టి ఫలితాలుంటాయి. నవగ్రహ స్తోత్రం చదవండి, శుభవార్త వింటారు.

ABOUT THE AUTHOR

...view details