Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (జూన్ 05 - జూన్ 11) - HOROSCOPE WEEKLY
Weekly Horoscope: ఈ వారం (జూన్ 5 - జూన్ 11) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (జూన్ 05 - 11)
By
Published : Jun 5, 2022, 4:02 AM IST
Weekly Horoscope: ఈ వారం (జూన్ 5 - జూన్ 11) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ముఖ్యకార్యాలను సమర్థంగా పూర్తిచేయండి. మనోబలంతో విజయం లభిస్తుంది. పనిలో స్పష్టత చాలా అవసరం. ఏ పని ముందు, ఏది వెనుక చేయాలో ఆలోచించి చేయాలి. గందరగోళస్థితి పనికిరాదు. బంధుమిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఉద్యోగవ్యాపారాలు బాగుంటాయి. ధనయోగం ఉంది. దుర్గా అష్టోత్తరం చదవండి, శాంతి లభిస్తుంది..
అదృష్టఫలాలు అందుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. కాలం సహకరిస్తోంది. ముందస్తు ప్రణాళికతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి. అధికార లాభం సూచితం. పదిమందికీ ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఆనందించే అంశాలున్నాయి. భూగృహ వాహనాది లాభాలున్నాయి. ఇష్టదేవతాధ్యానం మంచిది.
ఆశయం నెరవేరుతుంది. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలున్నాయి. ధనయోగం ఉంది. కొన్ని విషయాల్లో తెలియని ఆటంకాలున్నాయి. దగ్గరివారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది.
అనేక శుభయోగాలున్నాయి. ఒక్కొక్కదాన్నీ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతనప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రశంసలుంటాయి. ఇష్టదేవతాధ్యానం శుభప్రదం.
భగవదనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబపరంగా ఒడుదొడుకులను సమర్థంగా ఎదుర్కోవాలి. పట్టువిడుపులు అవసరం. ఉత్తమఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి. చంద్రగ్రహశ్లోకం చదివితే మంచిది.
మనసుపెట్టి పనిచేయండి, అనుకున్నది సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. తోటివారినుంచి ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. శాంతస్వభావంతో వ్యవహరిస్తూ లక్ష్యం దిశగా సాగాలి. పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. ముఖ్యకార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. సూర్యస్తుతి మేలు చేస్తుంది.
ధైర్యంగా, ఏకాగ్రతతో ముందుకు సాగాలి. తొందర వద్దు. తెలియని విఘ్నాలుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఆవేశం పనికిరాదు. సకాలంలో పనులు పూర్తిచేయండి. గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి. ఎదురుచూస్తున్న పనిలో విజయం ఉంటుంది. పేరుప్రతిష్ఠలకోసం ప్రయత్నించాలి. కుటుంబసభ్యుల వల్ల శక్తి లభిస్తుంది. శివస్మరణ శుభప్రదం.
ఆశయం నెరవేరుతుంది, అభివృద్ధిని సాధిస్తారు. తగినంత మానవప్రయత్నం చేయాలి. పరిస్థితిని అర్థంచేసుకుంటూ అవసరానికి తగినట్లు పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. నిరాశ పరిచే వారున్నారు. మనోబలం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్వయంకృషి ముందుకు నడిపిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు.
అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఊహించిన విజయాలు అదుతాయి. గృహవాహనాది శుభయోగాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపారలాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతాస్మరణ మంచిది.
అభీష్టసిద్ధి ఉంది. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరతారు. ఆపదలు తొలగుతాయి. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. విఘ్నాలున్నా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు విషయంలో మొహమాటం వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి, శుభం జరుగుతుంది.
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కోరికలు నెరవేరతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్రమపెరిగినా ఫలితం బాగుంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. సమష్టిగా తీసుకునే నిర్ణయం మేలుచేస్తుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తోంది. ఇష్టదైవాన్ని స్మరించండి, శాంతి లభిస్తుంది.
ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపారరీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. పట్టుదలతో ముందుకు వెళ్లండి, ధర్మమార్గంలో విజయం సాధిస్తారు. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.