Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం చూసుకున్నారా?
Weekly Horoscope: ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు మీ రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివరామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ఈ వారం రాశిఫలాలు
By
Published : Feb 12, 2023, 6:31 AM IST
Weekly Horoscope: ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు మీ రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివరామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..?
మంచి కాలం మొదలైంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. పనులు సకాలంలో పూర్తిచేయండి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. జీవితం సంతృప్తినిస్తుంది. అవాంతరాలను దాటి కార్యసిద్ధిని పొందుతారు. ఖర్చులు తగ్గిస్తూ పొదుపు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. దైవానుగ్రహంతో ఆపద తొలగుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభాన్నిస్తుంది.
అనుకున్న పనులు పూర్తవుతాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంటుంది. సౌమ్యంగా సంభాషిస్తూ పనులను చక్కబెట్టుకోవాలి. వారం మధ్యలో అదృష్టం ఎదురవుతుంది. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వ్యాపారరీత్యా శ్రమ పెరిగినా ధనలాభం ఉంటుంది. సూర్య నమస్కారం మంచిది.
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. ప్రశాంతచిత్తంతో పని మొదలుపెట్టండి. సకాలంలో బాధ్యతలను పూర్తిచేస్తే ఉద్యోగంలో కొంత సానుకూలత లభిస్తుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. మొహమాటంతో నష్టం వస్తుంది. ధర్మబద్ధంగా ఉండాలి. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మేలు.
మనసుపెట్టి పనిచేస్తే అభీష్టసిద్ధి కలుగుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రతతో చేసే పనులు అధిక లాభాన్నిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. భూ గృహ వాహనాది లాభాలుంటాయి. ప్రశాంతచిత్తంతో వ్యాపారంచేసి లాభాన్ని పొందాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. సూర్యారాధన ఉత్తమం.
చక్కని ప్రతిభతో పని చేసి ప్రశంసలందుకుంటారు. పెద్దల సహకారముంటుంది. చంచలత్వం వల్ల అశాంతి కలుగుతుంది. వ్యాపార విస్తరణకు వీలుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ మార్చవద్దు. వారం మధ్యలో మేలు జరుగుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే శుభం.
ఉద్యోగంలో కలిసి వస్తుంది. నిబద్ధతతో పనిచేయండి. మనోబలం సదా కాపాడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కష్టపడితే తగినంత ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. పట్టువిడుపులతో శాంతి లభిస్తుంది. ఇంట్లోవారి సూచనలు శక్తినిస్తాయి. మనోబలం అవసరం. నవగ్రహ శ్లోకాలు చదివితే శాంతి లభిస్తుంది.
వ్యాపారంలో లాభాలుంటాయి. అనుకున్న ఫలితం వస్తుంది. ప్రయత్న బలాన్నిబట్టి అదృష్టవంతులవుతారు. సకాలంలో విధులు పూర్తి చేయండి. ప్రశంసలు ఉంటాయి. ఆశిస్తున్న ఫలితం వెంటనే లభిస్తుంది. ఇంట్లోవారికి కలిసి వస్తుంది. చంచలత్వం లేకుండా మాట్లాడాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, మంచి జరుగుతుంది.
సంకల్పబలంతో కోరుకున్నది లభిస్తుంది. ధైర్యంగా పని ప్రారంభించాలి. ఉత్సాహం అవసరం. ఆర్థికస్థితి బాగుంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యాన్ని సాధించండి. వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులున్నా అంతిమంగా ఫలితం బాగుంటుంది. వారాంతంలో కార్యసిద్ధిని పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం శుభప్రదం.
శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. సకాలంలో పనులు ప్రారంభించండి. పదవీ లాభం సూచితం. స్వయంకృషితో చేసే పనులు ఉత్సాహాన్నిస్తాయి. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. వారం మధ్యలో గొప్ప విజయముంటుంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. వ్యాపారం బాగుంటుంది. విశేష ధన లాభాలుంటాయి. ఇష్టదేవతను ధ్యానించండి, శాంతి లభిస్తుంది.
మనోబలంతో పని చేయండి. అభీష్టాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. చంచలత్వంవల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అధికారులవల్ల శ్రమ పెరుగుతుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. నిజాయతీ కాపాడుతుంది. మీ పనిలో మీరు నిమగ్నమైతే ఏ దోషం రాదు. వారం మధ్యలో మంచి విజయముంటుంది. విష్ణు సహస్రం చదివితే మంచిది.
ఉద్యోగ ఫలితం శుభప్రదం. అధికారుల ఒత్తిడిని బుద్ధిబలంతో అధిగమించండి. విశ్వాసంతో పని మొదలుపెట్టండి. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. వ్యాపారరీత్యా కొంత మేలు జరుగుతుంది. ధన ధాన్య లాభాలుంటాయి. కోరుకున్న ఫలితాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతతను పొందాలి. సూర్యధ్యానం ఉత్తమం.
ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారలాభం ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. సాహస కార్యాలు విజయాన్నిస్తాయి. ఒక సమస్య వారం మధ్యలో పరిష్కారమవుతుంది. మనోబలంతో విఘ్నాలను అధిగమించాలి. గురుశ్లోకాన్ని చదవండి, బాధ్యతల్ని పూర్తి చేయగలుగుతారు.