తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? - వృశ్చిక రాశి ఫలం

Weekly Horoscope: సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 24 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

Weekly Horoscope
వారం రాశి ఫలం

By

Published : Sep 18, 2022, 6:21 AM IST

Weekly Horoscope: సెప్టెంబరు 18 నుంచి సెప్టెంబరు 24 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

శుభకాలం నడుస్తోంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. అర్థ లాభముంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందిస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఇష్టదేవతను ధ్యానించండి, భవిష్యత్తు బాగుంటుంది.

కీర్తి లభిస్తుంది. శత్రువుపైన విజయం సాధిస్తారు. ఆలోచనలు శక్తినిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేయాలి. కుటుంబ సభ్యులకు శ్రమ కలుగుతుంది. సమన్వయంతో ముందుకెళ్లాలి. తొందరపాటు పనికిరాదు. ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో శ్రద్ధపెంచాలి. వివాదాలు వద్దు. విష్ణుస్తుతి మేలు చేస్తుంది.

ధనధాన్యలాభం సూచితం. తల్లి తరఫు పెద్దల అండతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో సానుకూల ఫలితం వస్తుంది. వ్యాపారంలో విశేష శుభయోగం ఉంది. సకాలంలో స్పందించడం ముఖ్యం. ప్రశాంతచిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మీవల్ల సమాజానికి మేలు జరుగుతుంది. సూర్య దేవుడి స్మరణ శుభప్రదం.

అదృష్టకాలం నడుస్తోంది. ఎటుచూసినా శుభమే గోచరిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మ దేవతానుగ్రహం కలుగుతుంది. ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ప్రయత్నం బలంగా ఉండాలి. బంధుమిత్ర సమాగమంతో నూతనోత్సాహం కలుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. చంచలత్వం పనికిరాదు. ఇష్టదేవతాధ్యానం శ్రేయస్కరం.

దృఢసంకల్పంతో ముందుకెళ్లండి. బుద్ధిబలంతో వ్యాపారవిజయం లభిస్తుంది. పలుమార్గాల్లో లాభపడతారు. అభీష్టసిద్ధి ఉంది. సంపద పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పని ఒకటి అవుతుంది. సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆదిత్యహృదయం చదవండి, దైవానుగ్రహం ఉంటుంది.

పట్టుదల అవసరం. అనేక అవరోధాలుంటాయి. చంచలత్వం వల్ల సమస్య పెరుగుతుంది. ఉద్యోగంలో గంభీరంగా వ్యవహరించాలి. క్రమంగా సమయం అనుకూలిస్తుంది. చెడు ఊహించవద్దు. సమష్టి కృషి కార్యసిద్ధినిస్తుంది. కొందరివల్ల విచారం కలగవచ్చు. వ్యాపారంలో నష్టం రానివ్వద్దు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. అడుగడుగునా తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. సున్నితాంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. వ్యాపారదోషం సూచితం. అప్రమత్తంగా ఉంటూనే సంతృప్తి కలిగేవరకూ శ్రమిస్తూనే ఉండాలి. వారాంతంలో మంచి విజయం ఉంటుంది. నవగ్రహశ్లోకాలు పఠించండి, మనోబలం లభిస్తుంది.

అదృష్టవంతులవుతారు. విశేష కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మానవప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఉద్యోగం సానుకూలంగా ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. సుఖసౌభాగ్యాలుంటాయి. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. స్వస్థాన ప్రాప్తిసిద్ధిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి, ఆశయాలు నెరవేరతాయి.

ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. గతం కన్నా మంచి ఫలితాలు సాధిస్తారు. స్థిరబుద్ధితో చేసే ప్రయత్నం విజయాన్నిస్తుంది. దేనికీ వెనకాడవద్దు. ధర్మమార్గంలో పయనించండి. అవరోధాలు తొలగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. సమయానుకూల నిర్ణయాలు కలిసి వస్తాయి. ఇష్టదైవాన్ని దర్శించండి, కోరిక తీరుతుంది.

మంచి మనసుతో పని మొదలుపెట్టండి. తెలియని ఆటంకం ఉన్నా లక్ష్యాన్ని చేరగలరు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ప్రణాళికతో పనిచేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. చిత్తశుద్ధి రక్షిస్తుంది. ఆపదలు తొలగుతాయి. శాంత చిత్తంతో ఆలోచించాలి. విష్ణు సహస్రనామం చదవండి, కార్యసిద్ధి లభిస్తుంది.

అనేక విఘ్నాలున్నాయి. అప్రమత్తంగా ముందుకెళ్లాలి. ఆపదలు చుట్టుముడతాయి. పరిస్థితులు సహకరించడం లేదు. గతానుభవం కాపాడుతుంది. ఉద్యోగం పర్వాలేదు కానీ వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ఈర్ష్యాపరుల నుంచి నిందలు ఎదురవుతాయి. దైవబలం కాపాడుతుంది. వారం మధ్యలో ప్రయత్నం సఫలమవుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది.

ఉద్యోగం అనుకూలం. ఓర్పు చాలా అవసరం. సంతానం వల్ల మేలు జరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరతాయి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మొహమాటం పనికిరాదు. వ్యాపారంలో బాగా కష్టపడాలి. వారాంతంలో మంచి జరుగుతుంది. నవగ్రహధ్యానంతో ప్రశాంతత చేకూరుతుంది.

ABOUT THE AUTHOR

...view details