తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? - ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope: సెప్టెంబరు 11 నుంచి సెప్టెంబరు 17 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly horoscope
weekly horoscope

By

Published : Sep 11, 2022, 6:09 AM IST

Weekly Horoscope: సెప్టెంబరు 11 నుంచి సెప్టెంబరు 17 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

ఒత్తిడిని అధిగమిస్తూ పనిచేయాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. శాంతచిత్తంతో ఆలోచించాలి. వ్యాపారం బాగుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. మొహమాటం వల్ల శ్రమ ఎక్కువ అవుతుంది. కుటుంబంతో ఆనందిస్తారు. శుభవార్త వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయస్వామి స్మరణ మంచిది.

శుభయోగముంది. ప్రారంభించిన కార్యాలు సఫలమవుతాయి. అభీష్టసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రతిభతో మెప్పిస్తారు. సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. నిజాయతీగా పనిచేయండి. వ్యాపారబలం ఉంది. ధైర్యంగా మాట్లాడాలి. అపార్థాలు తొలగుతాయి. ధర్మం రక్షిస్తుంది. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

కాలం కలిసివస్తుంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. ఉన్నత స్థితి కొనసాగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విశేష లాభాలుంటాయి. పనుల్ని వాయిదా వేయవద్దు. ఖర్చు పెరిగే సూచన ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదాయవృద్ధికి ప్రయత్నించాలి. కుజశ్లోకం చదవండి, మనశ్శాంతి లభిస్తుంది.

విశేషలాభాలుంటాయి, ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం సహకరిస్తోంది. గుర్తింపూ ప్రశంసలూ ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. దేనికోసం బలంగా ప్రయత్నిస్తున్నారో అది కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. దుర్గాస్తుతి మేలు చేస్తుంది.

వ్యాపారలాభం సూచితం. ఆదాయం బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. భూలాభం, గృహయోగం ఉన్నాయి. ఇప్పుడు తీసుకునే ఒక నిర్ణయం కలిసి వస్తుంది. ధర్మమార్గంలో చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. అపార్థాలకు అవకాశం ఉంది. స్పష్టంగా సమాధానమివ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీసూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.

గురుబలంతో ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శ్రద్ధతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. గతానుభవంతో లక్ష్యాలను పూర్తిచేయాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చంచలత్వాన్ని వదిలితే స్వయంకృషితో అభివృద్ధిని సాధించగలరు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో సమస్య తొలగుతుంది. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.

ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి, అద్భుతమైన ఫలితం లభిస్తుంది. పలు మార్గాల్లో ప్రయత్నించండి. మీ గురించి అందరూ చెప్పుకునే స్థితి ఏర్పడుతుంది. పనిని మధ్యలో ఆపవద్దు. అవరోధాలున్నా అంతిమంగా విజయం మీదే. విసిగించేవారుంటారు, ఓర్పుతో మాట్లాడాలి. అవసరాలకు ధనం అందుతుంది. కుజశ్లోకం చదివితే మేలు.

ఉద్యోగవ్యాపారాల్లో బాగుంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి సాధిస్తారు. అధికారలాభం సూచితం. స్థిరమైన ఫలితాలుంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. భూగృహ వాహనాది యోగాలు అనుకూలం. సంపదలు పెరుగుతాయి. కుటుంబపరంగా ఆనందించే అంశాలు ఉన్నాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, కాలం ఆనందంగా గడుస్తుంది.

ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. పొరపాట్లు జరక్కుండా చూసుకోవాలి. దేనికీ తొందరపడవద్దు. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తిచేయండి, అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. రుణ సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక వేసుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదిత్య హృదయం చదవండి, శుభం జరుగుతుంది.

మనోబలంతో అభీష్ట సిద్ధిని పొందుతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. చిత్తశుద్ధితో ల.క్ష్యాన్ని చేరాలి. వ్యాపారరీత్యా ఇబ్బందులు ఉంటాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. సమాజంలో ఖ్యాతి లభిస్తుంది. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆదిత్యహృదయం చదవండి, ప్రశాంతత లభిస్తుంది.

ఉద్యోగంలో అధికారలాభం సూచితం. సంతృప్తికర ఫలితం లభిస్తుంది. మిత్రులను సంప్రదించి ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. చంచలత్వం వల్ల తెలియని ఆటంకం ఏర్పడుతుంది. పెద్దల ప్రమేయంతో సమస్య తొలగుతుంది. సంఘర్షణ స్థితి గోచరిస్తోంది. వారాంతానికి సర్దుకుంటుంది. నవగ్రహధ్యానం శుభప్రదం.

శుభయోగముంది. ఉద్యోగంలో పదవీలాభముంటుంది. కృషికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చేసే పనులు స్థిరమైన ఫలితాన్నిస్తాయి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబపరంగా బాగుంటుంది. విష్ణు సహస్రనామం చదవండి, శాంతి లభిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details