తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (జులై 31- ఆగస్టు 6) - ఈ వారం రాశిఫలం

Weekly Horoscope: ఈ వారం (జులై 31- ఆగస్టు 6) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే ?

ఈ వారం రాశిఫలం
ఈ వారం రాశిఫలం

By

Published : Jul 31, 2022, 4:35 AM IST

ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల సహకారం ఉంటుంది. తెలియని అవరోధాలున్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రులసాయంతో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించండి. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ధనయోగం ఉంది. సూర్యనమస్కారం శక్తినిస్తుంది.

అదృష్టయోగముంది. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. ప్రయత్నబలంతో సంకల్పం సిద్ధిస్తుంది. ధర్మబద్ధంగా నడచుకోండి. ఉద్యోగ స్థితి ఉన్నతంగా ఉంది. పదవీలాభం సూచితం. మంచి జీవితం లభిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. భూ గృహ వాహనాది యోగాలు అనుకూలం. దుర్గాదేవిని స్మరించండి, శుభవార్త వింటారు.

శుభయోగముంది. వ్యాపారంలో అధికలాభాలు ఉంటాయి. ఆశించిన అభివృద్ధిని అందుకుంటారు. ఉత్సాహంగా పనిచేయండి. ఉద్యోగంలో ఉన్నతస్థితి లభిస్తుంది. పలుమార్గాల్లో కలిసివస్తుంది. స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అపోహలు తొలగుతాయి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

అప్రమత్తంగా ఉండి సకాలంలో పనులు చేసుకుంటే ఫలితం వెంటనే కన్పిస్తుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే తెలియని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో కొంత శ్రమ పెరుగుతుంది. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి, ప్రశాంతత లభిస్తుంది.

దైవానుగ్రహంతో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితముంది. తగాదాలకు అవకాశం లేకుండా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. నిందలు మోపేవారు ఉన్నారు. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయండి. ఆత్మపరిశీలనతో మీ శక్తిని గుర్తించండి. బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ధనధాన్య లాభముంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది.

ఉద్యోగంలో తీసుకునే ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనులు పూర్తిచేసుకోవాలి. ధ]నలాభం విశేషంగా ఉంది. ఖర్చు కూడా పెరుగుతుంది. వారం మధ్యలో ఆనందించే అంశముంది. ఒక అవకాశం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ప్రతిభతో సమాజానికి ఉపయోగపడతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

ఉద్యోగంలో అనుకున్న ఫలితం లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయండి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. చంచలత్వం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. సమష్టి కృషి ఫలిస్తుంది. ఆర్థిక విజయం ఉంది. వ్యాపారంలో తెలియని చికాకులు ఇబ్బంది పెడతాయి. కుటుంబసభ్యుల సహకారం అవసరం. దత్తాత్రేయ స్వామిని స్మరించండి, అభీష్టసిద్ధి ఉంటుంది.

అద్భుతమైన విజయం సొంతమవుతుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగం బాగుంటుంది. సంకల్పసిద్ధి ఉంది. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. సంపూర్ణ విశ్వాసంతో చేపట్టే కార్యాలు ఫలితాన్నిస్తాయి. పదిమందికీ ఉపయోగపడే పనులు చేసే అవకాశం లభిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. స్వయంకృషితో వృద్ధిని సాధిస్తారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

అప్రమత్తత ముఖ్యం, అధిక దోషాలుంటాయి. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలను అమలుచేయాలి. ఉద్యోగంలో ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేయాలి. కుటుంబసభ్యుల సలహాలు రక్షిస్తాయి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.

కాలం సహకరించడం లేదు. ముఖ్య కార్యాలను కొంతకాలం వాయిదావేయాలి. అపారనష్టం కలిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మొహమాటం పనికిరాదు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సత్యనిష్ఠతో అవరోధాలను అధిగమించాలి. వారాంతంలో మంచి వార్త వింటారు. నవగ్రహస్తోత్రం చదవండి, శుభం జరుగుతుంది.

అదృష్టవంతులవుతారు. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉద్యోగంలో కోరుకున్నట్లే జరుగుతుంది. ఎటు చూసినా శుభమే గోచరిస్తోంది. వ్యాపారంలోనూ కలిసివస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. భారీ ప్రణాళికలతో బంగారు జీవితాన్ని సొంతం చేసుకునే సమయం. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదేవతాస్మరణ మంచిది.

మనోబలంతో ముందుకెళ్లాలి. అధికారులతో ప్రసన్నంగా మాట్లాడాలి. తోటివారి సహకారంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం సాధారణం. ముందువెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారం మధ్యలో ఒక సమస్య ఎదురవుతుంది. చెడు ఊహించవద్దు. సమష్టి పనులు విజయాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. సూర్యధ్యానం శుభాన్నిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details