తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 27 - మార్చి 05) - ఈనాడు రాశి ఫలాలు

Weekly Horoscope: ఈ వారం (ఫిబ్రవరి 27- మార్చి 05) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు.

Weekly Horoscope
ఈ వారం రాశిఫలం

By

Published : Feb 27, 2022, 3:56 AM IST

Weekly Horoscope: ఈ వారం (ఫిబ్రవరి 27- మార్చి 05) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ఉత్తమ కార్యాచరణ మేలుచేస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగం అనుకూలం. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలను అధిగమించాలి. ఆర్థిక సమస్యలు తీరతాయి. సమాజంలో పేరు సంపాదిస్తారు. పరోపకార ప్రయత్నం చేయండి. వివాదాలకు అవకాశముంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టదైవధ్యానం కాపాడుతుంది.

ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు సానుకూల ఫలితాలనిస్తాయి. భవిష్యత్తు కోసం శ్రమించండి. సహనంతో జయం కలుగుతుంది. ముఖ్యకార్యాలను ఏకాగ్రచిత్తంతో పూర్తిచేయాలి. సంకుచిత భావాలకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.

అదృష్టయోగముంది. ఉద్యోగంలో బాగుంటుంది. కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. తెలియని సమస్య ఒకటి మనసును పీడిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. మనోధైర్యం అవసరం. సూర్యారాధన ఉత్తమం.

కాలం సహకరించటం లేదు. శాంతంగా ఆలోచించాలి. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన గొప్పవారిని చేస్తుంది. అపార్థాలకు అవకాశమివ్వవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తీవ్రమైన స్థితి గోచరిస్తోంది. ధైర్యంగా ఎదుర్కోవాలి. మొహమాటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సున్నితంగా సంభాషించండి. విష్ణుస్మరణ శక్తినిస్తుంది.

అద్భుతమైన గ్రహస్థితి ఉంది. మీ కర్తవ్యాలను సమర్థతతో పూర్తిచేయండి. పదోన్నతులూ ప్రశంసలూ ఉంటాయి. ఖర్చులు ఉన్నా వ్యాపారంలో అభివృద్ధీ ఉంటుంది. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. వేగంగా పనిచేస్తే మరిన్ని లాభాలొస్తాయి. కుటుంబసభ్యులతో చర్చలు ధైర్యాన్నిస్తాయి. ఇష్టదేవతారాధన ఉత్తమం.

ఉద్యోగంలో అధికార లాభం సూచితం. సమస్య ఒకటి తొలగుతుంది. సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఉత్సాహంగా పనులను పూర్తిచేయాలి. వ్యాపారం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. మాటల్లో స్పష్టత, పనిలో నిజాయతీ అవసరం. ధర్మదేవతానుగ్రహం లభిస్తుంది. శివారాధన మంచిది.

అనుకూల కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి మనసుతో పని ప్రారంభించండి. గుర్తింపూ సహకారం లభిస్తాయి. పెద్దల ప్రోత్సాహముంటుంది. పనులు త్వరగా అవుతాయి. ఆనందించే అంశాలున్నాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు.

ఉద్యోగంలో బాగుంటుంది. కోరికలు నెరవేరతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లండి. చెడు ఊహించవద్దు. కుటుంబసభ్యుల సూచనలు పనిచేస్తాయి. భారీ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.

శుభకాలం నడుస్తోంది. కాలయాపన లేకుండా మొదలుపెడితే ఉత్తమ కార్యాలు సాధిస్తారు. ఉద్యోగంలో మంచి స్థితి గోచరిస్తోంది. శత్రుదోషం తొలగుతుంది. వ్యాపారం అద్భుతం. పలుమార్గాల్లో విశేషమైన లాభాలుంటాయి. అంచెలంచెలుగా పైకి వస్తారు. సమస్యలు పరిష్కారమవుతాయి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

లక్ష్యం నెరవేరుతుంది కానీ శ్రమ ఉంటుంది. అభివృద్ధికి అవసరమైన ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. ఆర్థిక నష్టాలకు అవకాశముంది. తెలివిగా వ్యవహరించాలి. మొహమాటం వల్ల ఇబ్బందులుంటాయి. గృహలాభం గోచరిస్తోంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, శుభవార్త వింటారు.

చక్కని ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరండి. సంతృప్తికరమైన విజయం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఓర్పు మిమ్మల్ని కాపాడుతుంది. దేనికీ ఆవేశపడవద్దు. ఆత్మీయుల సలహాలు అవసరం. సొంత నిర్ణయాలు కొంత శ్రమ కలిగిస్తాయి. సమష్టి కృషితో పని పూర్తిచేయండి. పనులు వాయిదా వేయవద్దు. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం.

శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. కార్యసిద్ధి ఉంటుంది. అధిక గ్రహాలు అనుకూలిస్తున్నాయి. పలుమార్గాల్లో లాభపడతారు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. దేనికీ సంకోచించవద్దు. మంచి మనసుతో చేసే ప్రతి పనీ మంచి ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఇష్టదేవతను ధ్యానించండి, శుభం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details